Smart Power Substations : విశాఖపట్నం జిల్లాలో స్మార్ట్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు

ఏపీఈపీడీసీఎల్ విద్యుత్‌ స్మార్ట్‌ సబ్‌స్టేషన్లను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తిస్థాయి ఆటోమేషన్‌ సబ్‌స్టేషన్‌గా మార్చనుంది.

Smart Power Substations : విశాఖపట్నం జిల్లాలో స్మార్ట్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు

Smart Substations

Smart power substations in visakha : ఏదైనా ప్రాంతంలో కరెంట్‌ పోతే.. విద్యుత్‌ సబ్ స్టేషన్‌ సిబ్బందికి ఫోన్‌ చేయాలి. లేదా ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ ఆఫీస్‌ సిబ్బందికైనా సమాచారం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో వారు సకాలంలో స్పందించరు. ఫోన్‌ లిఫ్ట్‌ చేసినా.. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం. అంటూ సమాధానం ఇస్తారు. అలాంటి సందర్భాల్లో రాత్రులైతే నిద్ర లేకుండా జాగారం చేయాల్సిందే. అదే పగలైతే అన్ని పనులు ఆగిపోతాయి. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలని విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధప్రదేశ్‌ ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ నిర్ణయించింది.

దీనిలో భాగంగా విద్యుత్‌ స్మార్ట్‌ సబ్‌స్టేషన్లను తీర్చిదిద్దుతోంది. ఇలాంటి స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే నేరుగా అధికారులకే సమాచారం వెళ్తుంది. రిపేర్లైనా, లోడ్‌ డిస్పాచ్‌లో హెచ్చు తగ్గుల నియంత్రణైనా అంతా రిమోట్‌ కంట్రోల్‌ ద్వారానే జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గిడిజాల సబ్‌స్టేషన్‌ను పూర్తిస్థాయి ఆటోమేషన్‌ సబ్‌స్టేషన్‌గా తీర్చిదిద్దనుంది.

Life Guards : ప్రాణాలు రక్షించే వారికే రక్షణ లేదు..!

స్మార్ట్ సబ్‌స్టేషన్‌ పరిధిలోని ఒక వీధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయినా, ఏ కారణంగానై విద్యుత్‌ సరఫరా నిలిచిపోయాని మీరు ఫోన్‌ చేసేలోపే అధికారులు స్పందించి.. దిగువస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తారు. లైన్‌మెన్లు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని.. రిపేర్లు చేసి.. సరఫరాను పునరిద్ధరిస్తారు. అంతా నిమిషాల్లోనే జరిగిపోతుంది. గిడిజాల 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌గా తీర్చి దిద్ది.. విజయవంతమైతే అన్ని విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను స్మార్ట్‌గా మార్చాలని ఈపీడీసీఎల్‌ నిర్ణయించింది.

ఈపీడీసీఎల్‌ పరిధిలోని అన్ని సబ్‌ స్టేషన్లను స్మార్ట్‌ సబ్‌ స్టేషన్లుగా మార్చేందుకు 335 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది. గిడిజాల సబ్‌ స్టేషన్‌ను స్మార్ట్‌ సబ్‌ స్టేషన్‌గా మార్చేందుకు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ సబ్‌స్టేషన్‌లో ఇక ఉద్యోగులెవరూ ఉండరు. పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని స్కాడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచే నడవనుంది. గిడిజాల సబ్‌స్టేషన్‌ పరిధిలోని విద్యుత్‌ పంపిణీ, ఇబ్బందులు ఇలా సమాచారమంతా ఆన్‌లైన్‌ ద్వారానే స్కాడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది.

Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదివీ కాలం పొడిగింపు

తదనుగుణంగా ఇక్కడి నుంచే కార్యకలాపాలను నియంత్రించేందుకు వీలు కలగనుంది. ఈపీడీసీఎల్‌ పరిధిలోని సబ్‌స్టేషన్లను ఆటోమేషన్‌ కిందకు మార్చాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా గిడిజాల సబ్‌స్టేషన్‌లో అమలు చేయనున్నారు. ఇందులో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.. స్మార్ట్‌ సబ్‌స్టేషన్‌లో ఎక్కడా ఉద్యోగుల అవసరం ఉండదు. అంతా రిమోట్‌ ద్వారానే నిర్వహించే వీలు కలుగుతుంది. వినియోగదారులకు కూడా మరింత నాణ్యమైన సేవలు అందుతాయి.