Shane Warne : ఇళయరాజా పాటకు గిటారు ప్లే చేసిన షేన్ వాట్సన్.. ఏ పాటకో తెలుసా? వీడియో వైరల్

వాట్సన్ గిటార్ ప్లే చేసిన వీడియోను వీక్షించిన ఇళయరాజా అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

Shane Warne

Shane Watson Guitar Played : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ పేరు క్రికెట్ పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికి సుపరిచితమే. మైదానంలో బాల్ తోనూ, బ్యాట్ తోనూ ప్రతిభచాటుతూ అనేకసార్లు ప్రత్యర్థి జట్ల ఓటమిలో వాట్సన్ కీలక భూమిక పోషించాడు. తాజాగా ఈ ప్లేయర్ వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో ‘డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ టాలెంట్స్’ అనే ప్రశ్నకు సమాధానంగా గిటారు చేతిలోకి తీసుకొని వాయించడం మొదలు పెట్టాడు. అయితే, వాట్సన్ ఆస్ట్రేలియా వ్యక్తి కావటంతో ఏ ఇంగ్లీష్ పాటకో, లేక బాలీవుడ్ పాటకో ట్యూన్ ఏదో ప్లే చేస్తాడని అందరూ భావిస్తారు. కానీ, వాట్సన్ మాత్రం ఇళయరాజా పాటకు గిటారు ప్లే చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Varun Lavanya : వరుణ్ లావణ్య పెళ్లి వేడుకల షెడ్యూల్ ఇదే.. ఏ రోజు ఏ కార్యక్రమం అంటే?

ఇళయరాజా పాట ‘ఎన్ ఇనియ పొన్నిలావే’ పాటకు కొంచెం గిటారు ప్లే చేసి వాట్సన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. వాట్సన్ గిటార్ ప్లే చేసిన వీడియోను వీక్షించిన ఇళయరాజా అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. వాట్సన్ ఐపీఎల్ లోనూ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరుపున ఆడాడు. అయితే, ఇంటర్వ్యూలో మదన్ గౌరీ మీకు ఐపీఎల్ లో ఫేవరేట్ టీం ఏదిఅంటూ ప్రశ్నించగా.. .నేను ఆడిన మూడు టీంలు నాకు పేవరేట్ జట్లు అని వాట్సన్ సమాధానం ఇచ్చాడు.