Kohli
End of an era: దుబాయ్‌లోని అబుదాబిలో టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్‌ను ఓడించి టీమిండియాని టోర్నీ సెమీస్‍లో అడుగుపెట్టేలా చేసింది. మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ గెలిచి ఉంటే, నమీబియాను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండేది. భారత జట్టు, ఇప్పుడు ఆడబోయే మ్యాచ్ లాంఛనప్రాయమే. కానీ, కెప్టెన్‌గా మాత్రం విరాట్ కోహ్లీకి ఇది ఆఖరి మ్యాచ్. రవిశాస్త్రి కూడా కోచ్‌గా ఈ మ్యాచ్ తర్వాత తప్పుకోనున్నారు.
సెమీస్ రేసు నుంచి ఔట్ అయిన భారత జట్టు.. 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్ దశకు చేరుకోకుండా ముందే బయటకు వచ్చేసింది. ఇక నమీబియాపై భారత్ పెద్ద విజయం సాధించినా దానివల్ల ప్రయోజనం ఏం లేదు.. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని రాహుల్ చాహర్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు అంటున్నారు. నమీబియాతో భారత్‌కు ఇదే తొలి టీ20 మ్యాచ్. ఈ జట్లు గతంలో ఒకే ఒక్కసారి (2003 వన్డే ప్రపంచకప్) తలపడ్డాయి.
తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో, న్యూజిలాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారీ రన్‌రేట్ సాధించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం..
ఫస్ట్ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
రెండవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది
మూడో మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది
నాల్గవ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది