CPL T20 : అవుట్ అవ్వడంతో హెల్మెట్ విసిరికొట్టాడు, వీడియో వైరల్

సీపీఎల్ (CPL 2021)...మ్యాచ్ లో అవుట్ అయ్యానన్న కోపంతో...హెల్మెట్ విసిరాడు...షెర్ఫేన్ రూథర్ పోర్డ్. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Cpl

Sherfane Rutherford : మైదానంలో కొంతమంది క్రీడాకారులు సహనం కోల్పోయి…బ్యాట్ ను విసిరేయడం, వికెట్లను తన్నుతూ…కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాగే…సీపీఎల్ (CPL 2021)…మ్యాచ్ లో అవుట్ అయ్యానన్న కోపంతో…హెల్మెట్ విసిరాడు…షెర్ఫేన్ రూథర్ పోర్డ్. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read More : Deepika Pilli: అందాలతో లొల్లి జేస్తున్న దీపికా పిల్లి!

కరేబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సెంట్ కిట్స్ – సెంట్ లూసియాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. సెంట్ కిట్స్ బ్యాట్స్ మెన్ షెర్ఫేన్ రూథర్ పోర్డ్ బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అప్పుడు 10 ఓవర్ లో రెండో బంతిని రూథర్ ఫోర్డ్ మిడాన్ దిశగా ఆడాడు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు పిలవగా…నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న ఆసీఫ్ ఆలీ వద్దని వారించాడు. అయితే..అప్పటికే…రూథర్ పోర్డ్ క్రీజు దాటి బయటకు వచ్చేశాడు. రోస్టన్ మెరుపు వేగంతో రనౌట్ చేశాడు.

Read More : Vehicle Horn : మారనున్న వాహనాల హారన్, ఇకపై వినసొంపైన సంగీతం సౌండ్లు

14 పరుగులు మాత్రమే చేసి….రనౌట్ గా వెనుదిరగడంతో…రూథర్ ఫోర్డ్ సహనం కోల్పోయాడు. పెవిలియన్ బాట పడుతూ…బౌండరీలైన్ వద్దకు రాగానే…బ్యాట్ తీసి కిందపడేసి…హెల్మెట్ తీసి విసిరేశాడు. చేతికున్న గ్లౌజ్ తీసి నేలకు విసిరికొట్టాడు. సెంట్ లూసియా ఘన విజయం సాధించింది. CPL T20 ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఇక రూథర్ ఫోర్డ్ విషయానికి వస్తే…ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో 201 పరుగులతో టోర్నమెంట్ లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ 19.3 ఓవర్లలో 118 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సెంట్ లూసియా 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి…లక్ష్యాన్ని చేధించింది.