Shikhar Dhawans Emotional Post On Son Zoravars Birthday
Shikhar Dhawan-Zoravar : భారత సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ గత కొన్నాళ్లుగా వ్యక్తిగత జీవితంలో పలు సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే అతడికి న్యాయస్థానం విడాకులు మంజారు చేసింది. తన భార్య అయేషా ముఖర్జీ నుంచి ధావన్ విడిపోవడంతో తన కొడుకు జొరావర్‌ను కలుసుకోలేకపోతున్న విషయం తెలిసిందే. తాజాగా తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ధావన్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. కొడుకును చూసి ఏడాది అవుతోందని చెబుతూ.. కుమారుడితో వీడియో కాల్ మాట్లాడిన ఫోటోను షేర్ చేశాడు.
‘నేను నిన్న ప్రత్యక్షంగా చూసి సంవత్సరం అయింది. గత మూడు నెలలుగా నీతో మాట్లాడకుండా చేస్తున్నారు. అన్ని విధాలుగా నన్ను బ్లాక్ చేస్తున్నారు. నీతో నేను నేరుగా మాట్లాడకపోయినా టెలీపతితో ఎప్పటికీ నీతో కనెక్ట్ అవుతూనే ఉంటాను. అలా నీ మనసుకు దగ్గరగా ఉంటాను. నువ్వు ఉన్నతంగా ఎదుగుతావని తెలుసు. నిన్ను మిస్ అవుతూనే ఉంటాను. నీ నవ్వు కోసం ఎదురుచూస్తూనే ఉంటాను. దేవుడి దయవల్ల మళ్లీ మనం కలుస్తామనే నమ్మకం ఉంది. ధైర్యంగా ఉండు. దయ, వినయం, సహనంతో ఉండు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.’ అంటూ ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.
AUS vs PAK : బ్యాట్ పట్టుకుని పావురాల వెంటపడిన లబుషేన్.. వీడియో చూస్తే నవ్వాగదు..!
శివర్ ధావన్ 2012 అక్టోబర్ 30న ఆస్ట్రేలియాకు చెందిన అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2014లో జోరావర్ పుట్టాడు. వీరిద్దరు విడిపోతున్నట్లు రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కొంతకాలం తరువాత భార్య తనను మానసికంగా వేధిస్తోందని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో ధావన్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇటీవల విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో కొడుకును తనకు అప్పగించాలని కోరుతూ ధావన్ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
అయితే.. కుమారుడితో ధావన్ ఎప్పుడైన వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది. పాఠశాల వెకేషన్ సమయంలో అయేషా తన కొడుకును భారత్‌కు తీసుకువచ్చి ధావన్ కుటుంబ సభ్యులతో సమయం గడిపేలా చూడాలని ఆదేశించింది. కాగా.. గత మూడు నెలలుగా కొడుకును చూడకుండా చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తాజాగా ధావన్ ఆరోపిస్తున్నాడు.
IND vs SA 1st test : టాస్ ఓడిపోయినందుకు ఆనందపడ్డ రోహిత్ శర్మ..! జడేజా ఎందుకు ఆడడం లేదంటే..?