IND vs SA 1st test : టాస్ ఓడిపోయినందుకు ఆనందప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌..! జ‌డేజా ఎందుకు ఆడ‌డం లేదంటే..?

టాస్ ఓడిపోవ‌డం పై రోహిత్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే టాస్ ఓడిపోయినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు.

IND vs SA 1st test  : టాస్ ఓడిపోయినందుకు ఆనందప‌డ్డ రోహిత్ శ‌ర్మ‌..! జ‌డేజా ఎందుకు ఆడ‌డం లేదంటే..?

Rohit Sharma Explains Reason Behind Ravindra Jadejas Absence

Updated On : December 26, 2023 / 3:38 PM IST

IND vs SA 1st test : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ ఫైన‌ల్ మ్యాచులో ఓట‌మి త‌రువాత సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా లు కొన్ని రోజులు విరామం తీసుకున్నారు. ద‌క్షిణాప్రికాతో సెంచూరియ‌న్ వేదిక‌గా ప్రారంభ‌మైన మొద‌టి టెస్టు మ్యాచుతో వీరు మ‌ళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ప్ర‌సిద్ధ్ కృష్ణ అరంగ్రేటం చేశాడు. ఇక టీమ్ఇండియా న‌లుగురు పేస‌ర్లు, ఓ స్పిన్న‌ర్‌తో బ‌రిలోకి దిగింది. అయితే.. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ర‌వీంద్ర జ‌డేజాకు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు.

కాగా.. ర‌వీంద్ర జ‌డేజా వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని మ్యాచ్ ఆరంభానికి ముందే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలియ‌జేసింది. ‘రవీంద్ర జడేజా ఉదయం వెన్ను పై భాగంలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడు. అతను మొదటి టెస్టుకు ఎంపిక కోసం అందుబాటులో లేడు.’ అని బీసీసీఐ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. ఇక టాస్ స‌మ‌యంలోనూ రోహిత్ శ‌ర్మ ఇదే విష‌యాన్ని చెప్పాడు.

Shakib Al Hasan : ప్ర‌పంచ‌క‌ప్‌లో బాల్ క‌న‌ప‌డ‌లే.. అందుకే విఫ‌లం.. లేదంటేనా..?

టాస్ ఓడిపోయినందుకు బాధ లేదు..

ఈ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ బ‌వుమా టాస్ గెలవ‌డంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్‌కు దిగింది. కాగా.. టాస్ ఓడిపోవ‌డం పై రోహిత్ స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే టాస్ ఓడిపోయినందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. ఎందుకంటే ఈ వికెట్ పై మొద‌ట బ్యాటింగ్ చేయాలా..? లేదా ఫీల్డింగ్ చేయాలా..? అనేది త‌న‌కు ఖ‌చ్చితంగా తెలియ‌ద‌న్నాడు. అందుక‌నే టాస్ ఓడిపోవ‌డం ఆనందం క‌లిగించింద‌న్నాడు.

కాగా.. ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై త‌మ‌కు అవ‌గాహ‌న ఉంద‌న్నాడు. ఇలాంటి కండిష‌న్స్‌లో మొద‌ట బ్యాటింగ్ చేయ‌డం స‌వాల్‌తో కూడుకున్న‌ది చెప్పాడు. అయిన‌ప్ప‌టికీ కుర్రాళ్లు స‌వాల్ స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎన్నో ఆశలతో వస్తుంటాం. మేము గత 2 పర్యటనలలో సిరీస్ గెలిచేందుకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చాము. అయితే.. అది జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుత జ‌ట్టు పై ఎంతో న‌మ్మ‌కం ఉంద‌న్నాడు. న‌లుగురు సీమ‌ర్లు ఓ స్పిన్న‌ర్‌తో ఆడుతున్న‌ట్లు తెలిపాడు. జ‌డ్డూ వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్నాడ‌ని, అత‌డి స్థానంలో అశ్విన్ ఆడుతున్నట్లు చెప్పాడు.

Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండ‌య్యా..