Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండయ్యా..
దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ను కేకేఆర్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది.

TV Presenter Hilarious Plea To KKR Mentor Gautam Gambhir Is Viral
KKR Mentor Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు సార్లు విజేతగా నిలిచింది. మరోసారి కప్పును సొంతం చేసుకోవాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకనే లోపాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కోసం పోటీ పడింది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం వెచ్చించి మరీ అతడిని సొంతం చేసుకుంది.
రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కేకేఆర్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా పేసర్ ను కొనుగోలు చేయడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కూడా ఉంది. వేలం సమయంలో అక్కడే ఉన్న గంభీర్.. స్టార్క్‌ను వదులుకోవద్దు అని చెప్పడం చూశాం. కాగా.. స్టార్క్ కోసం అన్ని కోట్లు వెచ్చించడం పై ఓ ఇంటర్వ్యూలో గంభీర్‌ను ప్రజెంటర్ జతిన్ సప్రూ అడిగారు. అనంతరం తనకు ఓ రెండు లేదా మూడు కోట్లు ఇప్పించండి అంటూ చేతులు జోడించి సరదాగా అడిగాడు.
Hardik Pandya : హార్దిక్ పాండ్య ఒక్కడి కోసమే ముంబై ఇండియన్స్ రూ.100 కోట్లు ఖర్చు..!
దీన్ని చూసిన గంభీర్ పగలబడి నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 15 సెకన్లు గల వీడియో పై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో..
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రూ.2కోట్ల బేస్‌ప్రైజ్‌తో వేలంలోకి వచ్చాడు. మొదటగా అతడి కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. ఆ తరువాత కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌లు పోటీలోకి వచ్చాయి. ముంబై, ఢిల్లీలు తప్పుకోగా.. కేకేఆర్, గుజరాత్‌లు ఎక్కడా తగ్గకపోవడంతో స్టార్క్ ధర రూ.20 కోట్లు దాటింది. అయినప్పటికీ పట్టువదలని కోల్‌కతా చివరకు స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు సొంతం చేసుకుంది.
Suresh Raina : ఇలా కూడా పిలుస్తారా? పెళ్లికి ధోని ఎలా పిలిచాడో చెప్పిన సురేశ్ రైనా.. వీడియో వైరల్
కాగా.. మిచెల్ స్టార్క్ దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఐపీఎల్‌లో ఆడనుండడం విశేషం. స్టార్క్ కోసం తమ పర్సులోని మొత్తంలో సగానికి పైగా ఖర్చు చేసినప్పటికీ కూడా కేకేఆర్ మరో తొమ్మిది మంది ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది.
After Auction Scenes ? pic.twitter.com/zB8BWfGY57
— football (@RealFIMDBIMD) December 24, 2023