Hardik Pandya : హార్దిక్ పాండ్య ఒక్కడి కోసమే ముంబై ఇండియన్స్ రూ.100 కోట్లు ఖర్చు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి.

Hardik Pandya
Hardik Pandya -Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ ఒకటి. ఐదు సార్లు ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోనే వెనుదిరిగిన ముంబై 17వ సీజన్‌లో మాత్రం కప్పును ముద్దాడాలనే కృత నిశ్చయంతో ఉంది. అందుకనే 17వ సీజన్ వేలానికి కంటే ముందు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు ఐదు సార్లు కప్పును అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి దక్కించుకున్న హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
కాగా.. హార్దిక్ పాండ్యను గుజరాత్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై దక్కించుకోవడం చాలా మందిని షాక్‌కు గురిచేసింది. హార్దిక్ కోసం ముంబై పెద్ద మొత్తంలోనే గుజరాత్‌కు ఆఫర్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఎంత మొత్తం అన్నది ఇరు జట్లతో పాటు ఐపీఎల్ నిర్వాహకులకు మాత్రమే తెలుసు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. హార్దిక్ కోసం ముంబై ఏకంగా రూ.100కోట్లు వెచ్చించినట్లు ఆ వార్త సారాంశం.
Kieron Pollard : కీరన్ పొలార్డ్‌కు లక్కీ ఛాన్స్..! ఇంగ్లాండ్ చరిత్రను పునరావృతం చేస్తుందా?
మరీ నిజంగానే ముంబై హార్దిక్ కోసం ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద అంత మొత్తం చెల్లించిందో లేదో తెలియదు. ఒకవేళ అదే నిజం అయితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పాండ్య చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు హార్దిక్ కోసం అంత పెద్ద మొత్తం అవసరం లేదు అని అంటుండగా మరికొందరు మాత్రం పెట్టిన ధర కంటే అతడు రెండు రెట్లు ఎక్కువ ప్రదర్శన చేస్తాడని అంటున్నారు.
కారణం అదేనా..?
హార్దిక్ కోసం ముంబై ఇండియన్స్ ఎంత మొత్తం చెల్లించింది అనేది తెలియనప్పటికీ అతడి కొనుగోలు చేయడం వెనుక ముంబైకి ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లుగా తెలుస్తోంది. 2025లో మెగావేలం జరగనుంది. ఆ సమయంలో ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ముంబై పాండ్యను ముందుగానే సొంతం చేసుకుంటే బాగుంటుందని బావించినట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ వయసు దృష్ట్యా ఒకటి లేదా రెండు సీజన్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ క్రమంలో పాండ్యకు ముంబై కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే భవిష్యత్తుకు డోకా ఉండదని భావించడం ఇంకో కారణమని అంటున్నారు.
Hardik Pandya’s trade details (Indian Express): pic.twitter.com/MNiN5grdYC
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 24, 2023
Suresh Raina : ఇలా కూడా పిలుస్తారా? పెళ్లికి ధోని ఎలా పిలిచాడో చెప్పిన సురేశ్ రైనా.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాండ్య కోలుకుంటున్నాడు. జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అతడు ఆడతాడని అంటున్నారు.