Kieron Pollard : కీరన్ పొలార్డ్‌కు లక్కీ ఛాన్స్..! ఇంగ్లాండ్ చరిత్రను పునరావృతం చేస్తుందా?
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ మరోసారి విజేతగా నిలవాలని భావిస్తోంది.

Kieron Pollard appointed England assistant coach for T20 World Cup
Kieron Pollard-ECB : వెస్టిండీస్-యూఎస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. జూన్ నెలలో ఆరంభం కానున్న ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు తమ ప్రిపరేషన్లు మొదలుపెట్టాయి. అయితే.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరో అడుగుముందుకు వేసింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ మరోసారి విజేతగా నిలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో వెస్టిండీస్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న, టీ20 క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న విండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.
ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎక్స్ (గతంలో ట్విటర్) వేదికగా తెలియజేసింది. లెజెండరీ ఆటగాడితో ఒప్పందం కుదుర్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. వెస్టిండీస్ జట్టు 2012లో పురుషుల టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఆ జట్టులో పొలార్డ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. టీ20ల్లో అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడనుందని ఈసీబీ వెల్లడించింది.
Shubman Gill : దక్షిణాఫ్రికా పేసర్లకు గిల్ హెచ్చరికలు..! సింహంతో సెల్ఫీ తీసుకుని..
Kieron Pollard to join Men’s coaching team for the @T20WorldCup ????????#EnglandCricket | #T20WorldCup
— England Cricket (@englandcricket) December 24, 2023
వెస్టిండీస్ జట్టు తరుపున మాత్రమే కాకుండా ఐపీఎల్‌తో పాటు వివిధ దేశాలు నిర్వహించిన టీ20 లీగుల్లో కీరన్ పొలార్డ్ ఆడాడు. అతడు 637 టీ20 మ్యాచులు ఆడాడు. 565 ఇన్నింగ్స్‌ల్లో 12,390 పరుగులు చేశాడు. ఓ సెంచరీతో పాటు 58 హాఫ్ సెంచరీలు అతడి పేరిట ఉన్నాయి. అత్యధిక స్కోరు 104.
ఇంగ్లాండ్ చరిత్రను పునరావృతం చేస్తుందా..?
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్ ముందు కూడా ఇంగ్లాండ్ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. ఆస్ట్రేలియా పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న, ఆటలో అనుభవం ఉన్న మైక్ హస్సీని అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. ఆ మెగాటోర్నీలో మెక్ హస్సీ సూచనలతో అదరగొట్టిన ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
Suresh Raina : ఇలా కూడా పిలుస్తారా? పెళ్లికి ధోని ఎలా పిలిచాడో చెప్పిన సురేశ్ రైనా.. వీడియో వైరల్
మరోసారి టీ20 ఛాంపియన్‌గా నిలిచేందుకు ఇంగ్లాండ్ ఇప్పుడు కీరన్ పొలార్డ్‌ను తీసుకుంది. మరి ఇంగ్లాండ్ ఆశించినట్లుగా మరోసారి విశ్వవిజేతగా నిలుస్తుందా..? లేదా అనేది చూడాల్సిందే.