Shakib Al Hasan : ప్రపంచకప్‌లో బాల్ కనపడలే.. అందుకే విఫలం.. లేదంటేనా..?
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ దారుణ ప్రదర్శనపై మొదటి సారి ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ స్పందించాడు.

Shakib Al Hasan
Shakib Al Hasan : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్ జట్టు ఘోరంగా విఫలమైంది. లీగు దశలో తొమ్మిది మ్యాచులు ఆడగా కేవలం రెండు అంటే రెండు మ్యాచుల్లోనే గెలుపొందింది. అఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ వంటి జట్లు తమస్థాయి కంటే మంచి ప్రదర్శన చేయగా బంగ్లాదేశ్ మాత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ దారుణ ప్రదర్శనపై మొదటి సారి ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ స్పందించాడు.
కెప్టెన్‌గానే కాకుండా ఓ బ్యాటర్ గానూ షకీబ్ విఫలం అయ్యాడు. దీనిపైనా అతడు మాట్లాడాడు. మెగా టోర్నీ మొత్తం తనకు బంతి సరిగా కనిపించలేదని చెప్పాడు. ఈ కారణంగాతో ఎక్కువగా పరుగులు సాధించలేకపోయినట్లు తెలిపాడు. ప్రపంచకప్ ఒకటి లేదా రెండు మ్యాచుల్లో కాదని టోర్నీ మొత్తం కంటి సమస్యతో ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. దీంతో బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయినట్లు తెలిపాడు.
ఈ విషయమై డాక్టర్లను సంప్రదించగా వారు కొన్ని పరీక్షలు చేశారు. నా ఎడమ కంటిలోని కార్నియా లేదా రెటీనాలో నీళ్లు ఉన్నట్లుగా చెప్పారు. ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. చుక్కల మందు ఇచ్చారని షకీబ్ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో షకీబ్ 7 మ్యాచులు ఆడాడు. 186 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 9 వికెట్లు సాధించాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ చేస్తుండగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది. దీంతో ప్రపంచకప్‌లో చివరి మ్యాచులకు దూరం అయ్యాడు. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలవడంతో బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించలేదు.
Gautam Gambhir : మిచెల్ స్టార్క్‌కు 24కోట్లు ఇప్పించారు.. నాకు ఓ రెండు కోట్లు ఇప్పించండయ్యా..