KC Cariappa : కాపాడండి.. మాజీ ప్రియురాలు కెరీర్‌ను నాశనం చేస్తానంటోంది.. పోలీసులకు క్రికెటర్ ఫిర్యాదు
తన కెరీర్‌ను నాశనం చేస్తానని మాజీ ప్రియురాలు బెదిరిస్తోందని, మీరే కాపాలని అంటూ క్రికెటర్ కేసీ కరియప్ప పోలీసులను ఆశ్రయించాడు.

KC Cariappa
KC Cariappa : తన కెరీర్‌ను నాశనం చేస్తానని మాజీ ప్రియురాలు బెదిరిస్తోందని, మీరే కాపాలని అంటూ క్రికెటర్ కేసీ కరియప్ప పోలీసులను ఆశ్రయించాడు. తన మాజీ ప్రియురాలు గత కొంతకాలంగా తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని, సూసైడ్ నోట్‌లో నా పేరు రాసి చనిపోతానని బెదిరిస్తోందని అని కరియప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరం ఎప్పుడో విడిపోయామని, ఆమెకు పలువురితో లైంగిక సంబంధాలు ఉన్నట్లు ఆరోపించాడు. తనను బెదిరించడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా హెచ్చరించిందని బెంగళూరులో పోలీసులకు కరియప్ప ఫిర్యాదు చేశాడు.
నాగసంద్రలోని రామయ్య లేఅవుట్‌లో నివాసం ఉంటూ కొడగుకు చెందిన కరియప్ప ఆ మహిళతో తనకు సంబంధం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. ఆమె డ్రగ్స్ అలవాటు, మద్యపానం కారణంగా అతను తన అనుబంధాన్ని కొనసాగించలేకపోయినట్లు వెల్లడించాడు. మద్యపానం మానేయమని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ అందుకు ఆమె సిద్ధంగా లేకపోవడంతో విడిపోయినట్లు చెప్పాడు.
Mohammed Siraj : హైదరాబాద్ ఫ్యాన్స్‌ను అంతమాట అంటావా..? అంటూ సిరాజ్ పై మండిపడుతున్న ఫ్యాన్స్
ఇదిలా ఉంటే.. గతేడాది సదరు మహిళ కరియప్ప పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు మోసం చేసినట్లు తెలిపింది. తాను గర్భం దాల్చడంతో అబార్షన్ మాత్రలు బలవంతంగా ఇచ్చాడని ఫిర్యాదు పేర్కొంది.
ఐపీఎల్‌తో అనుబంధం..
లెగ్ బ్రేక్ బౌలర్ అయిన కరియప్ప ఐపీఎల్ ప్రయాణం 2015లో ప్రారంభమైంది. రూ.2.4 కోట్లకు అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని కొనుగోలు చేసింది. 2016లో ఆ జట్టు తరుపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అనంతరం అతడిని కేకేఆర్ విడుదల చేసింది. ఆ తరువాత అతడిని రూ.80లక్షలకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కొనుగోలు చేసింది. 2019 సీజన్‌లో అతడు అమ్ముడుపోలేదు.
అయితే.. అదే సీజన్‌లో శివమ్ మావి గాయంతో దూరం కావడంతో అతడి స్థానంలో కరియప్పను కోల్‌కతా తీసుకుంది. 2020 వేలానికి ముందు అతడిని కేకేఆర్ విడుదలచేసింది. 2021లో రాజస్థాన్ రాయల్స్ అతడిని జట్టులో చేర్చుకుంది. 2024 ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ అతడిని వదిలిపెట్టింది. మొత్తంగా ఐపీఎల్‌లో 11 మ్యాచులు ఆడిన అతడు 8 వికెట్లు తీశాడు.