Mohammed Siraj : హైదరాబాద్ ఫ్యాన్స్‌ను అంతమాట అంటావా..? అంటూ సిరాజ్ పై మండిపడుతున్న ఫ్యాన్స్
హైదరాబాదీ పేసర్ టీమ్ఇండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Mohammed Siraj
సోషల్ మీడియాలో ఒక్కొసారి పాత వీడియోలు వైరల్ అవుతుండడాన్ని చూస్తూనే ఉంటాం. పాత వీడియోలు ఎందుకని మరోసారి వైరల్‌గా మారుతాయో చెప్పడం కాస్త కష్టమే. తాజాగా హైదరాబాదీ పేసర్ టీమ్ఇండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సిరాజ్ హైదరాబాద్ అభిమానులను ‘చిల్లర్’ అని అన్నాడు. దీంతో అతడిపై హైదరాబాదీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2021 సమయంలో ఆర్సీబీ సిరాజ్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ వీడియోలో సిరాజ్.. తాను మైదానంలోకి వెళ్లినప్పుడు కొంత మంది హైదరాబాద్ ఫ్యాన్స్ వచ్చి ‘సిరాజ్ క్యా కర్రా, కాన్ జారా’ (ఏం చేస్తున్నావ్, ఎక్కడికి వెలుతున్నావ్) అని లోకల్ బాషలో అడుగుతుంటారు. ఆ సమయంలో తాను అరేయ్.. ఈ చిల్లర్ క్రౌడ్ ఇక్కడకు కూడా వచ్చింది అని అనేవాడిని. తాను ఐపీఎల్‌లో ఆడుతున్నప్పటికీ వీళ్లు ఏ మాత్రం మారలేదు.. అలాగే ఉన్నారు అంటూ సిరాజ్ అన్నాడు.
వీడియో పాతదైనప్పటికీ సొంత అభిమానులను సిరాజ్ ఇలా అనడం కరెక్టు కాదని పలువురు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాను ఎంత గొప్ప స్థాయికి వెళ్లినప్పటికీ ఇలా అభిమానులను విమర్శించడం తగదు అని హితవు పలుకున్నారు.
ఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం దక్షిణాప్రికా పర్యటనలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తున్నారు. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి మొదటి టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి సిరాజ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. సీమర్లకు అచ్చొచ్చే దక్షిణాఫ్రికా పిచ్‌లపై సిరాజ్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడోనని అంటున్నారు.
Hardik Pandya : హార్దిక్ పాండ్య ఒక్కడి కోసమే ముంబై ఇండియన్స్ రూ.100 కోట్లు ఖర్చు..!
View this post on Instagram