AUS vs PAK : బ్యాట్ పట్టుకుని పావురాల వెంటపడిన లబుషేన్.. వీడియో చూస్తే నవ్వాగదు..!
మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.

Marnus Labuschagne Chases away pigeons at mcg
Australia vs Pakistan : మెల్‌బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో మూడు వికెట్లు 187 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (44), ట్రావిస్ హెడ్ (9) లు క్రీజులో ఉన్నారు.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ నుంచి బౌలర్లకు మంచి సహకారం అందుతుండడంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38), ఉస్మాన్ ఖవాజా (42) లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ఆగా సల్మాన్ బౌలింగ్‌లో వార్నర్ కాగా.. మరికాసేపటికే ఖవాజాను హసన్ అలీ బోల్తా కొట్టించాడు.
IND vs SA 1st test : టాస్ ఓడిపోయినందుకు ఆనందపడ్డ రోహిత్ శర్మ..! జడేజా ఎందుకు ఆడడం లేదంటే..?
ఆదుకుంటాడు అనుకున్న స్టీవ్ స్మిత్(26) సైతం పెవిలియన్‌కు చేరడంతో ఆస్ట్రేలియా 154 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పోతున్న మరోవైపు వికెట్లు లబుషేన్ మొండిగా నిలబడ్డాడు. ట్రావిస్ హెడ్‌తో కలిసి మరో వికెట్ పోకుండా మొదటి రోజును ముగించాడు. పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ, జమాల్, అగా సల్మాన్ లు తలా ఓ వికెట్ తీశారు.
ఆటకు పావురాల ఆటంకం..
కాగా.. మొదటి రోజు ఆటలో ఓ ఘటన చోటు చేసుకుంది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌కు పావురాలు ఆటంకం కలిగించాయి. మైదానంలో ఓ చోట పెద్ద సంఖ్యలో పావురాలు వచ్చాయి. స్ట్రైకింగ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ వాటిని చూసి క్రీజు నుంచి పక్కకు జరిగాడు. అది గమనించిన లబుషేన్ పరుగెత్తుతూ పావురాల వైపు వెళ్లాడు. బ్యాటును ఝులిపిస్తూ వాటిని తరిమే ప్రయత్నం చేశాడు. పాక్ ఆటగాడు హసన్ అలీ కూడా పావురాలను వెళ్లగొట్టడంలో ఆసీస్ స్టార్‌కు సాయం అందించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Shakib Al Hasan : ప్రపంచకప్‌లో బాల్ కనపడలే.. అందుకే విఫలం.. లేదంటేనా..?
Marnus Labuschagne tries his best to get the game going. ??️ pic.twitter.com/7KDVjt7Ozj
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2023