Shoaib Akhtar: ‘హార్దిక్ పాండ్యాకు గాయాలవుతాయని ముందే చెప్పా’

2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కనిపించడం లేదు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా దూరం కాగా, ఈ ఆల్‌రౌండర్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి.

Shoaib Akhtar: 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ తర్వాత హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో కనిపించడం లేదు. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా దూరం కాగా, ఈ ఆల్‌రౌండర్‌పై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో.. లెజండరీ పాకిస్తాన్ ఫేసర్ షోయబ్ అక్తర్ చెప్పిన మాటలు మరోసారి గుర్తు చేశాడు.

అప్పట్లోనే ఈ ముంబై ఇండియన్స్ క్రికెటర్ ఫిట్ నెస్ గురించి జోస్యం చెప్పాడు. ససన్నగా ఉండే అతని ఫిజిక్.. పక్షుల్లాగా అనిపిస్తున్నాయి. వెనుక కండరాలు అస్సలు లేవు. ఇప్పటికీ.. నా వెనుక కండరాలు అంటే భుజాల వెనుక చాలా బలంగా ఉంటాయ’ని అక్తర్ అన్నాడు.

‘నేను హార్దిక్ వెనుక భాగం తాకాను. అతను చాలా సన్నగా ఉన్నాడు. అప్పుడే అతణ్ని హెచ్చరించా.. గాయాలయ్యే అవకాశం ఉందని సూచించా. కానీ, అతను ఎక్కువసేపు క్రికెట్ ఆడటం వల్ల ఇలా జరిగిందని చెప్పాడు. సరిగ్గా గంటన్నర తర్వాత గాయాలపాలయ్యాడు’ అని అప్పట్లోనే చెప్పాడు.

…………………………………… : భారత్ లో మరో మూడు ఒమిక్రాన్ కేసులు

2018లో ఏసియా కప్ గ్రూప్ గేమ్‌లో భాగంగా పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతుండగా.. బౌలింగ్ వేస్తూ గాయాలపాలయ్యాడు. అప్పుడే అతణ్ని స్ట్రెచర్ పై తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించారు. ఆ ఘటన అతని కెరీర్ పై బాగా ఎఫెక్ట్ అయింది. అతని వెన్ను గాయాల కారణంగా.. ఐపీఎల్ 2021లోనూ ముంబై తరపున అంతగా పర్ఫామ్ చేయలేకపోయాడు.

అందుకే మజిల్ పెంచమని హార్దిక్ కు సూచించడట అక్తర్.

ట్రెండింగ్ వార్తలు