Shreyas Iyer : భార‌త జ‌ట్టుకు సునీల్ న‌రైన్ దొరికాడు..! ఇన్ని రోజులు ఈ క‌ల‌ను ఎక్క‌డ దాచావు అయ్య‌ర్‌..

జ‌ట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని భావిస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం త‌న బౌలింగ్ నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చుకునే ప‌నిలో ప‌డ్డాడు.

Shreyas Iyer imitates Sunil Narine mystery bowling action in Buchi Babu tournament

Shreyas Iyer-Buchi Babu tournament : జ‌ట్టులోని ప్ర‌తి ఆట‌గాడు బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ రాణించాల‌ని టీమ్ఇండియా ప్ర‌ధాన కోచ్‌గా ఇటీవ‌ల బాధ్య‌త‌లు చేప‌ట్టిన గౌత‌మ్ గంభీర్ ఓ సంద‌ర్భంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో స‌హా భార‌త ఆట‌గాళ్లు అందరూ ప్ర‌స్తుతం ఈ విష‌యంపై గ‌ట్టిగానే దృష్టి పెట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో టీ20 సిరీస్ ఆఖ‌రి మ్యాచ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, రింకూ సింగ్‌లు బౌలింగ్ చేయ‌గా, వ‌న్డే సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌లు బంతిని అందుకున్నారు.

ఇక జ‌ట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల‌ని భావిస్తున్న శ్రేయ‌స్ అయ్య‌ర్ సైతం త‌న బౌలింగ్ నైపుణ్యాల‌ను మెరుగుప‌ర‌చుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం అయ్య‌ర్‌.. బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ నేతృత్వంలోని ముంబై జట్టులో అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లు ఉన్నారు.

Dawid Malan : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు డేవిడ్ మ‌ల‌న్

టీఎన్‌సీఏతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అయ్య‌ర్ బౌలింగ్ చేశాడు. అయితే.. అత‌డు అచ్చం సునీల్ న‌రైన్ త‌ర‌హాలో బౌలింగ్ చేయ‌డం విశేషం. న‌రైన్ లాగానే బంతిని దాచిపెట్టి, ఆ పై బాల్‌ను వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. భార‌త జ‌ట్టుకు సునీల్ న‌రైన్ లాంటి బౌల‌ర్‌ దొరికాడంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌రుపున శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సునీల్ న‌రైన్‌లు క‌లిసి ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. అయ్య‌ర్ నాయ‌క‌త్వంలోని కేకేఆర్ ఐపీఎల్ 2024 విజేత‌గా నిలిచింది.

శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు ఎంపికైన అయ్య‌ర్ దారుణంగా విఫ‌లం అయ్యాడు. మూడు మ్యాచుల్లో కేవ‌లం 38 ప‌రుగులే చేశాడు. సెప్టెంబ‌ర్ 19 నుంచి భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ కంటే ముందు జ‌ర‌గ‌నున్న దేశ‌వాలీ టోర్నీ దులీప్ ట్రోఫీలోనూ అయ్య‌ర్ ఆడ‌నున్నాడు. టెస్టు జ‌ట్టుకు ఎంపిక కావాలంటే మాత్రం దులీప్ ట్రోఫీలో అత‌డు ఖ‌చ్చితంగా రాణించాల్సిన అవ‌స‌రం ఉంది.

ICC Test Rankings : బాబ‌ర్ ఆజాం టైమ్ అస్స‌లు బాలేదు.. య‌శ‌స్వీ, కోహ్లీ దూకుడు..

ట్రెండింగ్ వార్తలు