ICC Test Rankings : బాబర్ ఆజాం టైమ్ అస్సలు బాలేదు.. యశస్వీ, కోహ్లీ దూకుడు..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా పురుషుల టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

ICC Test rankings Babar Azam suffers major decline
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా పురుషుల టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమ్ఇండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీలు తమ స్థానాలను మెరుగుపరచుకున్నారు. అయితే.. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ ఆజాం ఆరు స్థానాలను దిగజారాడు.
ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 881 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
సౌతాఫ్రికాకు బిగ్ షాక్ ఇచ్చిన వెస్టిండీస్.. 3-0 తేడాతో టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్
ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (751) ఆరులో కొనసాగుతున్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుని ఏడో ర్యాంకు కు చేరుకున్నాడు. యశస్వి ఖాతాలో 740 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 737 రేటింగ్ పాయింట్లతో రెండు స్థానాలు మెరుగుపరచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.
ఇక పాక్ ఆటగాడు బాబర్ ఆజాం (734) ఆరు స్థానాలు దిగజారి 9వ ర్యాంకుకు పడిపోయాడు. బంగ్లాదేశ్ పై భారీ సెంచరి చేసిన రిజ్వాన్ (728) ఏడు స్థానాలు మెరుగుపరచుకుని 10వ ర్యాంకుకు చేరుకున్నాడు. పాక్ పై 191 పరుగులతో రాణించిన బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫిక్ రహీమ్ ఏడు స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 17కు చేరుకున్నాడు.
ఐసీసీ పురుషుల టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్..
* జో రూట్ (ఇంగ్లాండ్) – 881 రేటింగ్ పాయింట్లు
* కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) – 859 రేటింగ్ పాయింట్లు
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 768 రేటింగ్ పాయింట్లు
* హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) – 758 రేటింగ్ పాయింట్లు
* స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 757 రేటింగ్ పాయింట్లు
* రోహిత్ శర్మ (భారత్) – 751 రేటింగ్ పాయింట్లు