Womens T20 World Cup 2024 : బ్రేకింగ్‌.. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ..

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది.

Womens T20 World Cup 2024 : బ్రేకింగ్‌.. మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ..

BCCI announces Indias squad for Womens T20 World Cup 2024

Updated On : August 27, 2024 / 1:25 PM IST

Womens T20 World Cup 2024 : యూఏఈ వేదిక‌గా అక్టోబ‌ర్ 3 నుంచి 20 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన జ‌ట్టును వెల్ల‌డించింది. ఈ మెగా టోర్నీలో హ‌ర్మన్ ప్రీత్ నాయ‌క‌త్వంలోనే భార‌త జ‌ట్టు బ‌రిలోకి దిగ‌నుంది. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన‌ను ఎంపిక చేశారు.

ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. గాయ‌ల‌తో బాధ‌ప‌డుతున్న వికెట్‌కీపర్‌ యాస్తికా భాటియా, ఆల్‌రౌండర్‌ శ్రేయంకా పాటిల్‌లు ఫిట్‌నెస్‌ సాధిస్తే జట్టుతోపాటు యూఏఈకి వెళ్ల‌నున్న‌ట్లు పేర్కొంది.

KL Rahul : కేఎల్ రాహుల్‌కు ల‌క్నో షాక్‌.. కెప్టెన్‌గా వ‌ద్దే వ‌ద్దు.. ప్లేయ‌ర్‌గా ఓకేనా..?

ఈ టోర్నీలో మొత్తం 10 జ‌ట్లు పాల్గొన‌నుండ‌గా.. వీటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌, పాకిస్తాన్ లు ఉండగా.. గ్రూప్‌-బిలో వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, స్కాట్లాండ్ జ‌ట్లు ఉన్నాయి. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను అక్టోబ‌ర్ 4న న్యూజిలాండ్‌తో ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో అక్టోబ‌ర్ 6న త‌ల‌ప‌డ‌నుంది. 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో భార‌త్ ఆడ‌నుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు..
భారత జట్టు : హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పుజా వస్త్రాకర్‌, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్*, సంజనా సంజీవన్.

Womens T20 World Cup 2024 : క్రికెట్ అభిమానులు సిద్ధం కండి.. అక్టోబ‌ర్ 6న భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌.. దుబాయ్ వేదిక‌గా