Dawid Malan : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు డేవిడ్ మలన్
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు.

Dawid Malan announces retirement from international cricket
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించేశాడు. 37 ఏళ్ల ఈ ఆటగాడు 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. తన కెరీర్‌లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 1074, వన్డేల్లో 1450, టీ20ల్లో 1892 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓ సెంచరీ, 50 ఓవర్ల క్రికెట్‌లో ఆరు, 20 ఓవర్ల క్రికెట్‌లో ఓ శతకం బాదాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన రెండో ఇంగ్లాండ్ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు ప్రస్తుత పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఈ ఘనత సాధించాడు. టెస్టులు, వన్డేల్లో కంటే టీ20ల్లో మలన్ రాణించాడు.
ICC Test Rankings : బాబర్ ఆజాం టైమ్ అస్సలు బాలేదు.. యశస్వీ, కోహ్లీ దూకుడు..
టీ20 స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. తన అరంగ్రేట టీ20 మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 44 బంతుల్లో 78 పరుగులు చేశాడు. కివీస్ పై 48 బంతుల్లో శతకం బాదాడు. 2020 సెప్టెంబరులో ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.
అంతేకాదండోయ్.. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 24 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022ను గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో మలన్ సభ్యుడిగా ఉన్నాడు.
KL Rahul : కేఎల్ రాహుల్‌కు లక్నో షాక్.. కెప్టెన్‌గా వద్దే వద్దు.. ప్లేయర్‌గా ఓకేనా..?
2023 వన్డే ప్రపంచకప్ అనంతరం ఇంగ్లాండ్ జట్టులో అతడికి స్థానం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌కు అతడిని సెలక్టర్లు పట్టించుకోలేదు. ఈ క్రమంలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.