Shreyas Iyer : కెప్టెన్ అవ్వగానే గంభీర్ కి ఫస్ట్ ఝలక్ ఇచ్చిన శ్రేయర్ అయ్యర్.. సర్పంచ్ సాబ్ అంటే అట్లుంటది..

భార‌త టీ20 జ‌ట్టు కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ (Shreyas Iyer) త‌న భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టమైన ప్రకటన చేశారు.

Shreyas Iyer shows his attitude after becoming T20 captain was it a reference to Gambhir

  • కెప్టెన్‌గా ఎంపికైన త‌రువాత శ్రేయ‌స్ అయ్య‌ర్ కామెంట్స్‌
  • ఎవ‌రి నీడ‌లో ఉండాల‌ని అనుకోవ‌డం లేదు
  • నా సొంత శైలిలో జ‌ట్టును న‌డిపిస్తా

Shreyas Iyer : భార‌త టీ20 జ‌ట్టు కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్ త‌న భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టమైన ప్రకటన చేశారు. కెప్టెన్సీ అనేది తనకు దక్కిన గొప్ప గౌరవమని, అయితే ఈ బాధ్యత కోసం తాను తన సహజ సిద్ధమైన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని కుండబద్దలు కొట్టారు. తాను ఎవరి నీడలోనూ ఉండాలని అనుకోవడం లేదని, తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉందని, అదే పంథాలో భార‌త జ‌ట్టును ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

భారత క్రికెట్‌లో కొత్త కెప్టెన్లు వచ్చినప్పుడు వారిని పూర్వపు కెప్టెన్లతో పోల్చడం సర్వసాధారణం. అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం ఈ పోలికలకు దూరంగా ఉంటూ తన సొంత ముద్ర వేయాలని భావిస్తున్నారు.

*Manav Suthar : మానవ్ సుతార్.. నువ్వు తోపు బ్రో.. 94 ఏళ్ల చరిత్రలో ఆ రికార్డు కొట్టిన సెకండ్ ప్లేయర్

ఇదిలా ఉంటే.. డిసెంబ‌ర్ 2023లో టీమ్ఇండియా త‌రుపున శ్రేయ‌స్ అయ్య‌ర్ చివ‌రి సారి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్ప‌టి నుంచి మ‌రో మ్యాచ్‌ను అత‌డు ఆడ‌లేదు. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ వంటి టోర్నీల్లోనూ అత‌డికి చోటు ద‌క్క‌లేదు. అయిన‌ప్ప‌టికి అయ్యర్ నిరాశ చెందకుండా దేశీవాళీ క్రికెట్‌లో పరుగులు వరద పారించి, ఐపీఎల్‌లో అద్భుత కెప్టెన్సీతో తానేంటో నిరూపించుకున్నారు.

ఐపీఎల్ విజయాలే విజయకేతనాలు..

శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడానికి ప్రధాన కారణం ఐపీఎల్‌లో అతని తిరుగులేని రికార్డే. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2025లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లారు. 2026లో సైతం తన కెప్టెన్సీ నైపుణ్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒత్తిడి సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ, తోటి ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టడమే అతని ప్రధాన బలం.

గంభీర్-అయ్యర్ బంధంపై..

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ జోడి మళ్లీ కలవడం. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ట్రోఫీ గెలిచినప్పుడు గంభీర్ మెంటార్‌గా ఉండటంతో ఆ విజయ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలోకే వెళ్ళింది. అయ్యర్ కెప్టెన్సీకి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఇప్పుడు గంభీర్.. టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా, అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే.. నేను ఎవరి నీడలోనూ ఉండాలనుకోవడం లేదు అంటూ అయ్యర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. గంభీర్‌కు ఇది అయ్యర్ ఇచ్చిన గట్టి కౌంటర్ అంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

*Rishabh Pant : పంత్ కొట్టిన బంతి డ్రోన్‌ను తాకిందా? వైర‌ల్ వీడియో..

భవిష్యత్ లక్ష్యాలు..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).. రాబోయే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028 దృష్టిలో ఉంచుకుని యువ జ‌ట్టును సిద్ధం చేస్తోంది. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఈ భారీ ప్ర‌ణాళిల్లో భాగ‌మేన‌ని అంటున్నారు. అయ్య‌ర్ ముందు ఇప్పుడు కేవ‌లం మ్యాచ్‌లు గెల‌వ‌మే కాకుండా.. రాబోయే ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో భార‌త్‌కు మ‌రిన్ని ట్రోఫీఉలు అందించ‌గ‌ల బ‌ల‌మైన‌, స‌రికొత్త జ‌ట్టును నిర్మించాల్సిన గురుత‌ర బాధ్య‌త ఉంది.