Champions Trophy 2025: ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నా: శ్రేయాస్‌ అయ్యర్ కామెంట్స్‌

ఆ టైమ్‌ను తన ఆట తీరును మెరుగు పర్చుకునేందుకు వాడుకుంటానని అన్నాడు.

Shreyas Iyer

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్‌ సమయంలో ఒత్తిడి ఎదుర్కొన్న భారత్‌ను ఆదుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఆదివారం న్యూజిలాండ్‌పై ధాటిగా ఆడి అతడు 79 పరుగులు బాదిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (2), విరాట్ కోహ్లీ (11) ఘోరంగా విఫలమైనప్పటికీ శ్రేయాస్‌ అయ్యర్ నిలబడ్డాడు. టీమిండియా గౌరవప్రదమైన స్కోరును చేయడంలో శ్రేయాస్‌ కీలక పాత్ర పోషించాడు.

Also Read: అయ్యయ్యో.. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్ వేళ రోహిత్ శర్మ ఇలాంటి కామెంట్స్‌ ఎందుకు చేశాడు?

ఈ సందర్భంగా ఇవాళ శ్రేయాస్‌ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలిపాడు. ఏడాదిన్నరగా తాను ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పాడు. క్రికెట్‌లో అసలు కెరీర్‌ పరంగా తాను వెనకబడిపోయినట్లు తెలిపాడు. తాను బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను సైతం కోల్పోయినట్లు గుర్తుచేసుకున్నాడు.

ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఎవరూ హెల్ప్ చేయరని, అటువంటి సమయంలో కొద్ది మందే సపోర్టుగా ఉంటారని తెలిపాడు. అయినప్పటికీ తాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని అన్నాడు. తనకు తానే మోటివేట్‌ చేసుకున్నానని చెప్పాడు. తనకు జరిగిపోయిన దాని గురించి అధికంగా ఆలోచించడం నచ్చదని తెలిపాడు.

అలా ఆలోచించూ కూర్చోవడం కంటే ఆ టైమ్‌ను తన ఆట తీరును మెరుగు పర్చుకునేందుకు వాడుకుంటానని అన్నాడు. జరిగిపోయిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం కంటే వర్తమాన కాలంలోని విషయాల మీదే తాను అధికంగా దృష్టి పెడతానని చెప్పాడు. కాగా, మంగళవారం ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీఫైనల్‌ ఆడుతుంది.