Champions Trophy: అయ్యయ్యో.. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్ వేళ రోహిత్ శర్మ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు?
ఈ రోజుల్లో గేమ్ ఇలాగే ఉంటుందని అన్నాడు.

సెమీఫైనల్స్ అంటే ఎంతటి గొప్ప ఆటగాడికైనా కాస్త నెర్వస్‌గానే ఉంటుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఇది తప్పడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మంగళవారం ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీఫైనల్ ఆడాల్సి ఉన్న వేళ భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కాస్త నెర్వస్‌గా ఉందని చెప్పాడు.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడుతున్నందుకు టీమిండియా మరింత ఒత్తిడిలో ఉందన్న విశ్లేషణలను రోహిత్ శర్మ కొట్టిపారేశారు. మ్యాచ్‌ను గెలవాలన్న కోరికతో ఉండే ఒత్తిడి రెండు జట్లలో సమానంగా ఉంటుందని తెలిపాడు.
రోహిత్ శర్మ ఇవాళ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఐసీసీ నాకౌట్లలో ఆస్ట్రేలియాకు బలమైన చరిత్ర ఉందని చెప్పాడు. అయినప్పటికీ ఆసీస్‌ను ఓడించేందుకు తన టీమ్ వద్ద ప్రణాళికలు ఉన్నాయని, దాని మీదే దృష్టి పెట్టామని తెలిపాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా చేతిలోనే భారత్ ఓడిపోయింది. ఇప్పుడు అదే జట్టుతో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తలపడనుంది.
Also Read: ఈ బంగారం ధరలకు మళ్లీ ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? నిపుణులు ఏమంటున్నారు?
ఈ అంశాలపై రోహిత్ స్పందిస్తూ.. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో ఆడడం మంచి చాలెజింగ్‌గా ఉంటుందని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడిన మూడు మ్యాచులలాగే సెమీ ఫైనల్‌ను కూడా ఆడాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇటువంటి సెమీఫైనల్ మ్యాచ్ ముందు ఒత్తిడి ఉంటుందని, అయితే, టీమిండియా తన సొంత బలాలపై దృష్టి పెట్టిందని చెప్పాడు. ప్రత్యర్థి జట్టు ఆటతీరును కూడా తాము అర్థం చేసుకున్నట్లు తెలిపాడు. తాము అదే రీతిలో సమాధానం చెబుతామని అన్నాడు. ఒక జట్టుగా, ఆటగాడిగా, బ్యాటింగ్ యూనిట్‌గా, బౌలింగ్ యూనిట్‌గా తమ జట్టు గెలవడానికి ఉపయోగపడే వాటిపై అధికంగా దృష్టి పెడుతున్నామని చెప్పాడు.
ఆస్ట్రేలియా చాలా సంవత్సరాలుగా బాగా ఆడుతున్న జట్టు అని, కాబట్టి, గట్టిపోటీ ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు. అలాగే, మ్యాచ్ మధ్యలో కాస్త ఒత్తిడి కూడా ఉంటుందని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ రోజుల్లో గేమ్ ఇలాగే ఉంటుందని అన్నాడు.