Shreyas Iyer to lead India A for One-Day series vs Australia A
Shreyas Iyer : సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 వరకు కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆస్ట్రేలియా-ఏతో భారత్-ఏ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌లో పాల్గొనే భారత్-ఏ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలో భారత్-ఏ బరిలోకి దిగనుంది.
కాగా.. రెండు, మూడు వన్డే మ్యాచ్‌లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండనున్నాడు. ఈ క్రమంలో తిలక్ ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఆసియాకప్‌లో ఆడుతున్న తిలక్‌తో పాటు హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లు సైతం చివరి రెండు వన్డేలకు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఆసీస్-ఏతో తొలి వన్డేకు భారత-ఏ జట్టు ఇదే..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ ప్రియాంష్ పోరెల్ (వికెట్ కీపర్).
రెండు, మూడో వన్డేకు భారత జట్టు ఇదే..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్జ్, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గురుజప్‌నీత్ సింగ్, భిష్‌విర్ సింగ్, యుదీష్‌విర్ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.
ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును సైతం బీసీసీఐ ప్రకటించింది. రజత్ పాటిదార్ సారథ్యంలో రెస్ట్ ఆఫ్ ఇండియా బరిలోకి దిగనుంది. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, ఇషాన్ కిషన్ లకు ఈ జట్టులో చోటు దక్కింది.
ఇక శ్రేయస్ అయ్యర్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీనిపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. అయ్యర్ 6 నెలల పాటు రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అతడికి చోటు ఇవ్వలేదంది.
Sunil Gavaskar : బంగ్లాదేశ్ పై తుఫాన్ ఇన్నింగ్స్.. అభిషేక్ శర్మ పై మండిపడిన సునీల్ గవాస్కర్..
అయ్యర్.. వెన్నునొప్పికి యూకేలో సర్జరీ చేయించుకుని కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడుతున్న క్రమంలో అతడు మరోసారి వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొంటున్నాడు, ఈ క్రమంలోనే అయ్యర్ ఈ ఫార్మాట్ నుంచి 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ సమయాన్ని అతడు ఫిట్‌నెస్ పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
ఇరానీ కప్ కోసం రెస్టాప్ ఇండియా జట్టు ఇదే..
రజత్ పటీదార్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యష్ ధుల్, షేక్ రషీద్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తనుష్ కొటియన్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, శరన్ష్ జైన్.