Shubman Gill brought a specialised water purification machine to Indore
Shubman Gill : భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం (జనవరి 18న) మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ 1-1తో సమం అయిన నేపథ్యంలో మూడో వన్డే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ క్రమంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు జట్లు ఇండోర్‌కు చేరుకున్నాయి. మ్యాచ్ కోసం ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) తన వెంట 3 లక్షల విలువ చేసే ప్రత్యేక నీటి శుద్ధీకరణ యంత్రాన్ని (వాటర్ ప్యూరిఫయర్) తీసుకుని వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వాటర్ ప్యూరిఫయర్ చాలా ప్రత్యేకమైందని చెబుతున్నారు. ఈ పరికరం RO-ట్రీట్ చేయబడిన, ప్యాక్ చేయబడిన బాటిల్ వాటర్‌ను కూడా తిరిగి శుద్ధి చేయగలదు.
ఈ పరికరాన్ని గిల్ హోటల్‌లోని తన పర్సనల్ రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం పై మాట్లాడేందుకు టీమ్ మేనేజ్‌ర్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ ఖ్యాతి గడించినప్పటికీ, ఇటీవల కలుషిత నీటి సంక్షోభం కారణంగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. నీటి కాలుష్యం వల్ల ఇండోర్‌లోని ఓ కాలనీలో ఇటీవల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కారణం వల్లనే గిల్ ఫ్యూరిఫయర్‌ను తీసుకొని వచ్చి ఉంటాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు.
ఏదీ ఏమైనప్పటికి మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది.