ENG vs IND : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌.. క‌రుణ్ నాయ‌ర్‌, రిష‌బ్ పంత్‌ల పై కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆ ఇద్ద‌రూ..

మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జట్ల మ‌ధ్య నేటి (బుధ‌వారం జూన్ 23) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Shubman Gill key comments ahead of 4th test against England

మాంచెస్ట‌ర్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జట్ల మ‌ధ్య నేటి (బుధ‌వారం జూన్ 23) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. సిరీస్‌లో 1-2 తేడాతో వెనుక‌బ‌డి ఉన్న భార‌త్ ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ముగ్గురు కీల‌క ఆట‌గాళ్లు గాయాల‌తో దూరం అయ్యారు. ఈ విష‌యాన్ని మ్యాచ్‌కు ముందు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో టీమ్ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ సైతం ధ్రువీక‌రించాడు.

తెలుగు ఆట‌గాడు, ఆల్‌రౌండర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఇప్ప‌టికే సిరీస్‌కు దూరం కాగా.. పేసర్లు అర్షదీప్‌ సింగ్‌, ఆకాశ్‌దీప్ లు నాలుగో టెస్టు ఆడ‌ర‌ని గిల్ చెప్పాడు. అయిన‌ప్ప‌టికి తమ జ‌ట్టులో 20 వికెట్లు తీసే బౌల‌ర్లు ఉన్నార‌న్నాడు. అన్షుల్‌ అరంగేట్రానికి దగ్గరగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. అయితే.. అతడికి, ప్రసిద్ధ్‌కు మధ్య పోటీ ఉందన్నాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు అన్షుల్‌, ప్ర‌సిద్ధ్‌ల‌లో ఎవ‌రిని ఆడించాల‌నే విష‌యం పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నాడు.

Harbhajan Singh : ‘నువ్వు మా నాన్న కొట్టావు గ‌దా.. నీతో మాట్లాడ‌ను..’ శ్రీశాంత్ కూతురు అలా అనేస‌రికి హ‌ర్భ‌జ‌న్ ఏం చేశాడో తెలుసా?

క‌రుణ్‌కు మ‌రో ఛాన్స్‌..
ఎనిమిదేళ్ల త‌రువాత రీ ఎంట్రీ ఇచ్చిన క‌రుణ్ నాయ‌ర్.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పెద్ద‌గా రాణించ‌లేదు. దీంతో నాలుగో టెస్టులో అత‌డిపై వేటు వేయాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. అయితే.. క‌రుణ్ నాయ‌ర్‌కు గిల్ మ‌ద్ద‌తు పుష్క‌లంగా ఉంది. దీంతో అత‌డు నాలుగో టెస్టులోనూ ఆడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. క‌రుణ్ అంశంపై గిల్ మాట్లాడుతూ.. క‌రుణ్‌ బ్యాటింగ్‌తో సమస్యేమీ లేదు. అతను బాగా ఆడుతున్నాడు. అతనో 50 పరుగులు చేస్తే అంతా సర్దుకుంటుంది అని గిల్ చెప్పాడు. దీంతో ప‌రోక్షంగా అత‌డు నాలుగో టెస్టులోనూ ఆడ‌నున్నాడు అనే సంకేతాలు గిల్ ఇచ్చాడు.

పంత్ లేకుంటే ఎలా..
మూడో టెస్టు మ్యాచ్‌లో రిష‌బ్ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డు నాలుగో టెస్టులో ఆడ‌తాడో లేదో అన్న సందేహ‌లు అంద‌రిలో ఉన్నాయి. ఇక పంత్ విష‌యంపై గిల్ క్లారిటీ ఇచ్చాడు. ఖ‌చ్చితంగా పంత్ నాలుగో టెస్ట్‌లో ఆడ‌తాడ‌ని స్ప‌ష్టం చేశాడు. అత‌డే వికెట్ కీపింగ్ సైతం చేస్తాడ‌ని అన్నాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. చ‌రిత్ర సృష్టించేందుకు 25 ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్‌..

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే నాలుగో టెస్ట్‌ మ్యాచ్ కు ఇంగ్లాండ్ త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు ఇదే..
జాక్ క్రాలీ, ⁠ ⁠బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, ⁠హ్యారీ బ్రూక్,⁠ బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్, లియామ్ డాసన్, ⁠క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.