Shubman Gill: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీపై శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు.. వారి కెప్టెన్సీలో ఆడిన సమయంలో..

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీపై కీలక కామెంట్స్ చేశాడు.

Shubman Gill

Shubman Gill Rohit Sharma and Virat Kohli : ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టెస్టు సిరీస్‌కు భారత జట్టు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ చేరిన టీమిండియా ప్లేయర్లు.. ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. అయితే, తాజాగా స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కెప్టెన్సీపై కీలక కామెంట్స్ చేశాడు.

 Also Raed: దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమాది చాలా విలాసవంతమైన జీవితం.. ఆయనకు ఎన్నికోట్ల ఆస్తులున్నాయో తెలుసా.. ఖరీదైన కార్లు కూడా..

గిల్ మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కావాలని కలలో కూడా అనుకోలేదు. జట్టులోని ప్రతిఒక్క ప్లేయర్‌కు భద్రతాభావం, సంతోషం కలిగేలా జట్టు సంస్కృతిని సృష్టించాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీల గురించి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ తనకు స్పష్టమైన దారి చూపాడని గిల్ చెప్పాడు. రోహిత్ చూడటానికి అంత దూకుడుగా ఉన్నట్లు కనిపించక పోవచ్చు. కానీ, అతను వ్యూహాల విషయంలో చాలా చురుగ్గా ఉంటాడని గిల్ అన్నాడు.

 

“రోహిత్ భాయ్ వ్యూహాల పరంగా చాలా దూకుడుగా ఉంటాడు. మ్యాచ్‌లకు ముందు, సిరీస్ సమయంలో, సిరీస్ తర్వాతకూడా ఆటగాళ్లతో ఎలా ఉండాలనే విషయంపై స్పష్టత కలిగి ఉంటాడు. రోహిత్ భాయ్ జట్టులో ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాడంటే.. అతడు తిట్టినా ఏ ఆటగాడు కూడా మనసులోకి తీసుకోడు. ఎందుకంటే మ్యాచ్ సమయంలో రోహిత్ ఆటగాళ్లతో కోపంగా ప్రవర్తించినా మ్యాచ్ తరువాత ఆ ప్రభావం కనిపించదు. అతడు ఏదైనా అన్నా జట్టుకోసమే అంటాడని అందరికీ తెలుసు. అతడు వ్యక్తిత్వం అలాంటిది. అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండటం గొప్ప విషయం.’’ అంటూ రోహిత్ కెప్టెన్సీపై గిల్ ప్రశంసలు కురిపించాడు.

విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లీ నాయకత్వంలో ఆడినప్పుడు టెస్టుల్లో అతడి చురుకుదనం నాకు నచ్చేది. అతడి నుంచి చాలా నేర్చుకున్నా. తన వ్యూహాలు పనిచేయకపోతే వెంటనే మరో వ్యూహాన్ని అమలు చేసేవాడు. తనకేం కావాలో బౌలర్లకు చెప్పేవాడు’’ అంటూ శుభ్‌మన్ గిల్ చెప్పాడు.