Sikandar Raza : టీ20ల్లో జింబాబ్వే కెప్టెన్ అరుదైన ఘ‌న‌త‌.. దిగ్గ‌జ‌ ఆట‌గాళ్ల వ‌ల్లే కాలే..!

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే ఆట‌గాడు సికింద‌ర్ ర‌జా అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Sikandar Raza

Sikandar Raza five consecutive T20 fifty : అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే ఆట‌గాడు సికింద‌ర్ ర‌జా అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచ‌రీలు చేసి చ‌రిత్ర సృష్టించాడు. ఆదివారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో అత‌డు అర్ధ‌శ‌త‌కం చేయ‌డం ద్వారా ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులో 42 బంతులు ఎదుర్కొన్న ర‌జా 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 62 ప‌రుగులు చేశాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 కోసం గ‌తేడాది ఐసీసీ క్వాలిఫ‌య‌ర్స్‌ను నిర్వ‌హించింది. ఆఫ్రికా రిజీయ‌న్ క్వాలిఫ‌య‌ర్స్ ఆడిన జింబాబ్వే పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ రిజీయ‌న్ నుంచి న‌మీబియా, ఉగాండ దేశాలు క్వాలిఫై అయ్యాయి. న‌వంబ‌ర్‌లో జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ మ్యాచుల్లో సికింద‌ర్ ర‌జా రువాండా పై 58, నైజీరియా పై 65, కెన్యా పై 82 ప‌రుగులు చేశాడు. అనంత‌రం స్వ‌దేశంలో ఐర్లాండ్‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో 65 ప‌రుగులు చేశాడు.

Cooch Behar Trophy : క‌ర్ణాట‌క యువ బ్యాట‌ర్ సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 404 నాటౌట్‌

అయితే.. ఈ మ్యాచులో అత‌డి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా త‌రువాతి రెండు మ్యాచుల‌కు దూరం అయ్యాడు. తాజాగా లంక‌తో జ‌రిగిన మొద‌టి టీ20లో 62 ప‌రుగులు చేశాడు.

మొద‌టి బ్యాట‌ర్‌..
అంత‌ర్జాతీయ క్రికెట్‌లో బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌, క్రిస్‌గేల్‌, క్రెయిగ్ విలియ‌మ్స్‌, రయాన్ పఠాన్, గుస్తావ్ మెకియోన్ లు వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లోనూ అర్ధ‌శ‌త‌కాలు చేశారు. తాజాగా వీరి రికార్డును బ‌ద్ద‌లు కొడుతూ ర‌జా ఈ రికార్డును అందుకున్నాడు. ఇక ర‌జా ఐదు హాఫ్ సెంచ‌రీలు సాధించిన మ్యాచుల్లో బ్యాట‌ర్‌గానే కాకుండా బౌల‌ర్‌గానూ రాణించాడు. ప్ర‌తీ మ్యాచులో క‌నీసం రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. వ‌రుస‌గా 3,2,2,3,3 వికెట్లు తీశాడు.

NZ vs PAK : బ్యాట‌ర్ సిక్స్ కొట్ట‌గానే.. బాల్ తీసుకుని వెన‌క్కి తిరిగి చూడ‌కుండా ల‌గెత్తిన ఫ్యాన్

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన తొలి టీ20లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 143 ప‌రుగులు చేసింది. ఈ ల‌క్ష్యాన్ని శ్రీలంక స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ట్రెండింగ్ వార్తలు