Sitanshu Kotak breaks silence on Arshdeep Singh exclusion from playing XI against UAE
Sitanshu Kotak : ఆసియాకప్ 2025లో భారత్ శుభారంభం చేసింది. యూఏఈని చిత్తు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలి మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో టీమ్ఇండియా టీ20 స్పెషలిస్టు పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు స్థానం దక్కలేదు. ఈ విషయంపై జట్టు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో ఎందుకు తీసుకోలేదు అనే విషయం పై టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడాడు.
తుది జట్టు ఎంపికలో ఎక్కడా కూడా పక్షపాత ధోరణి ఉండదన్నాడు. పిచ్, మ్యాచ్ పరిస్థితులను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుందన్నాడు. స్క్వాడ్‌లోని 15 మంది ఆటగాళ్లు కూడా తుది జట్టులో ఆడేందుకు అర్హులేనని చెప్పుకొచ్చాడు. అయితే.. తుది జట్టు ఎంపిక పై కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చర్చిస్తారని తెలిపాడు.
ఎవరైనా ఆటగాడికి తుది జట్టులో స్థానం దక్కకపోతే బాధగా ఉంటుందన్నాడు. ఇది టీమ్ గేమ్ అని, జట్టు విజయంలో ప్రతి ఒక్క ఆటగాడి భాగస్వామ్యం ఉంటుందన్నాడు. ఇక్కడ ఎవరికి వ్యక్తిగత అజెండా ఉండదన్నాడు. జట్టుకు ఏదీ మంచిది అయితే అదే ఫాలో అవుతామని చెప్పుకొచ్చాడు. ఆ విధంగానే కోచ్, కెప్టెన్ నిర్ణయాలు ఉంటాయన్నాడు.
ఇక బెంచీపై కూర్చొనే వారు గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్లకు సాయం చేస్తుంటారని తెలిపారు. ఇక సంజూ శాంసన్ అద్భుత ప్లేయర్ అని అన్నాడు. అతడు ఐదు లేదా ఆరు స్థానాల్లో ఎక్కువగా ఆడలేదన్నాడు. దాని అర్థం అతడు అక్కడ సరిగ్గా ఆడడని కాదన్నాడు. జట్టు అవసరాలను బట్టి నిర్ణయాలు ఉంటాయని, శాంసన్ ఎక్కడైనా సరే అద్భుతంగా ఆడే ఆటగాడు అని కితాబు ఇచ్చాడు. ఈ విషయంలో సంజూ శాంసన్ కూడా ఆనందంగానే ఉన్నాడని తెలిపాడు.
Jos Buttler : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. దక్షిణాఫ్రికాపై ఒకే ఒక్కడు..
గిల్ గురించి ఏమన్నాడంటే..?
ఏ ఫార్మాట్‌లో ఎలా ఆడాలనేది ప్రస్తుత తరం ఆటగాళ్లు అందరికి తెలుసునని చెప్పాడు. వన్డేలు, టీ20ల్లో పవర్ ప్లేను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై అందరికి ఓ అవగాహన ఉంటుందన్నాడు. దీని కోసం బ్యాటర్లు తమ టెక్నిక్‌ను మార్చుకుంటూ ఉంటారన్నాడు. ఇక గిల్ ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాడన్నాడు. అతడు మూడు ఫార్మాట్లలలో ఆడే ఆటగాడు అని చెప్పుకొచ్చాడు. అతడిపై వర్క్‌లోడ్ ఎక్కువగా ఉందని తాను భావించడం లేదన్నాడు. ఈ విషయంలో బ్యాటర్లకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నాడు. అయితే.. వర్క్‌లోడ్ అనేది పేసర్లకు చాలా కీలక అని సితాన్షు కొటక్ తెలిపాడు.