Hardik Pandya : ప్లేయ‌ర్‌గా వెళ్లాడు.. కెప్టెన్‌గా తిరిగొచ్చాడు.. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో పాండ్య రీ ఎంట్రీ అదుర్స్‌..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (2024) సీజ‌న్ కోసం కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో క‌లిశాడు.

Skipper Hardik Pandya joins Mumbai Indians camp ahead of IPL 2024

Hardik Pandya – IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (2024) సీజ‌న్ కోసం కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుతో క‌లిశాడు. 2021 త‌రువాత తొలిసారిగా ముంబై డ్రెస్సింగ్‌లోకి అడుగుపెట్టాడు పాండ్య‌. అప్పుడు ప్లేయ‌ర్‌గా ఉన్న పాండ్య ప్ర‌స్తుతం కెప్టెన్సీ హోదాలో అడుగుపెట్ట‌డం విశేషం. ముంబైని వీడిన రెండు సంవ‌త్స‌రాల కాలంలో అత‌డు గుజ‌రాత్ టైటాన్స్‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. అత‌డి సార‌థ్యంలో గుజ‌రాత్ ఓసారి విజేత‌గా, మ‌రోసారి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది.

2024 సీజ‌న్‌కు ముందు నిర్వ‌హించిన మినీ వేలానికి ముందే ముంబై ఇండియ‌న్స్ పాండ్య‌ను ట్రేడింగ్ ద్వారా ద‌క్కించుకుంది. అత‌డి కోసం ముంబై పెద్ద రూ.100కోట్లు వెచ్చించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిపై అటు ముంబై గానీ, ఐపీఎల్ నిర్వ‌హ‌కులు గానీ, పాండ్య గానీ స్పందించ‌లేదు. అత‌డిని ద‌క్కించుకోవ‌డంతో పాటు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుకు ఐదు సార్లు క‌ప్పును అందించిన రోహిత్ శ‌ర్మ‌ను నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది.

WPL 2024 : మైదానంలో క‌న్నీటి ప‌ర్యంత‌మైన ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌.. ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్లు వ‌చ్చి

ఐపీఎల్ జ‌ర్నీని పాండ్య ముంబై ఇండియ‌న్స్‌తోనే మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈక్ర‌మంలో త‌న సొంత ఫ్రాంచైజీకి తిరిగి వ‌చ్చిన పాండ్య మొద‌ట దేవుళ్ల చిత్ర ప‌టం వ‌ద్ద, ముంబై కోచ్ మార్క్‌బౌచ‌ర్‌తో క‌లిసి దీపం వెలిగించాడు. పాండ్య‌కు అంద‌రూ ఘ‌న స్వాగతం ప‌లికారు.

కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో హార్దిక్ పాండ్య గాయ‌ప‌డ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయ‌ప‌డిన పాండ్య అప్ప‌టి నుంచి ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవ‌లే కోలుకున్న అత‌డు డీవై పాటిల్ టీ20 టోర్న‌మెంట్‌తో ఆడి ఐపీఎల్‌కు సిద్ధం అయ్యాడు. గుజ‌రాత్ ను విజ‌య‌ప‌థంలో న‌డిపించిన పాండ్య ముంబైని ఎలా న‌డిపిస్తాడోన‌ని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు