WPL 2024 : మైదానంలో క‌న్నీటి ప‌ర్యంత‌మైన ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌.. ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్లు వ‌చ్చి

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రెండో సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.

WPL 2024 : మైదానంలో క‌న్నీటి ప‌ర్యంత‌మైన ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌.. ప్ర‌త్య‌ర్థి ప్లేయ‌ర్లు వ‌చ్చి

Emotional Richa Ghosh break down in tears after one run loss against Delhi

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రెండో సీజ‌న్‌లో మ్యాచ్‌లు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోగా తాజాగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ సైతం అర్హ‌త సాధించింది. ఆదివారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధించింది. దీంతో ఢిల్లీ జ‌ట్టు సంబురాల్లో మునిగిపోగా.. ఆర్‌సీబీ జ‌ట్టు నిరాశ‌లో కూరుకుపోయింది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి 181 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో జెమిమా రోడ్రిగ్స్ (58; 36 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచ‌రీ చేసింది. అలిసే క్యాప్సే (48; 32 బంతుల్లో 8 ఫోర్లు) వేగంగా ఆడింది. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో శ్రేయాంక పాటిల్ నాలుగు వికెట్లు తీయ‌గా ఆశా శోభన ఓ వికెట్ ప‌డ‌గొట్టింది.

WTC Points Table : న్యూజిలాండ్‌పై విజ‌యం.. డ‌బ్ల్యూటీసీలో టీమ్ఇండియా అగ్ర‌స్థానికి పొంచి ఉన్న ఆసీస్ ముప్పు

అనంత‌రం ల‌క్ష్య‌ఛేద‌న‌లో బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్లో ఏడు వికెట్లు కోల్పోయి 180 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో రీచా ఘోష్‌(51; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఎల్లీస్ పెర్రీ (49; 32 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్‌) వేగంగా ఆడినా ఆర్‌సీబీకి ఓట‌మి త‌ప్ప‌లేదు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మారిజానే కాప్, అలిస్ క్యాప్సీ, శిఖా పాండే, అరుంధతి రెడ్డి లు త‌లా ఓ వికెట్ తీశారు.

విజ‌యానికి 3 ఓవ‌ర్లో 40 ప‌రుగులు అవ‌స‌రం కాగా..

ఆర్‌సీబీ విజ‌యానికి ఆఖ‌రి మూడు ఓవ‌ర్ల‌లో 40 ప‌రుగులు అవ‌స‌రం అయ్యాయి. 18 ఓవ‌ర్‌లో రియాఘోష్‌తో పాటు జార్జియా (12 ;6 బంతుల్లో 2 ఫోర్లు) చెరో ఫోర్ కొట్ట‌డంతో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 19వ ఓవ‌ర్‌లో సైతం వీరిద్ద‌రు చెరో ఫోర్ కొట్ట‌గా ఆఖ‌రి బంతికి జార్జియా ఔట్ అయ్యింది. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. దీంతో విజ‌య స‌మీక‌ర‌ణం 6 బంతుల్లో 17 గా మారింది.

జొనాస్సెన్ ఆఖ‌రి ఓవ‌ర్‌ను వేసింది. తొలి బంతికి రిచా సిక్స్ కొట్టింది. రెండో బంతి డాట్ కాగా మూడో బంతికి దిశా ర‌నౌటైంది. నాలుగో బంతికి రెండు ప‌రుగులు రాగా ఐదో బంతిని సిక్స్‌గా మ‌లిచింది రిచా ఘోష్‌. ఆఖ‌రి బంతికి రెండు ప‌రుగులు తీస్తే ఆర్‌సీబీ విజ‌యం సాధిస్తుంద‌న‌గా చివ‌రి బంతికి రిచా ర‌నౌటైంది. ఆమె డైవ్ చేసిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ప‌రుగు తేడాతో ఓడిపోవడంతో ఆమె మైదానంలోనే క‌న్నీళ్లు పెట్టుకుంది. అయితే.. ఆమె పోరాట‌ప‌టిమ‌ను అంద‌రూ మెచ్చుకున్నారు.

PSL 2024 : మ‌రీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమ‌న్నాయ్ చెప్పు.. ఫ‌లితం అనుభ‌వించావుగా