WTC Points Table : న్యూజిలాండ్‌పై విజ‌యం.. డ‌బ్ల్యూటీసీలో టీమ్ఇండియా అగ్ర‌స్థానికి పొంచి ఉన్న ఆసీస్ ముప్పు

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(డ‌బ్ల్యూటీసీ) 2023-25లో ఫైన‌ల్ రేసులో నిలిచేందుకు అన్ని జ‌ట్లు హోరాహోరీగా పోటీప‌డుతున్నాయి.

WTC Points Table : న్యూజిలాండ్‌పై విజ‌యం.. డ‌బ్ల్యూటీసీలో టీమ్ఇండియా అగ్ర‌స్థానికి పొంచి ఉన్న ఆసీస్ ముప్పు

WTC Points Table Australia climb to 2nd spot after hammering New Zealand

WTC Points Table 2023-25 : ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌(డ‌బ్ల్యూటీసీ) 2023-25లో ఫైన‌ల్ రేసులో నిలిచేందుకు అన్ని జ‌ట్లు హోరాహోరీగా పోటీప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో పాయింట్ల ప‌ట్టిక‌లో జ‌ట్ల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా మ‌ళ్లీ రెండో స్థానానికి చేరుకుంది. త‌న విజ‌య‌శాతాన్ని 62.51కి పెంచుకుంది.

ఈ సైకిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా 12 మ్యాచులు ఆడింది. 8 మ్యాచుల్లో గెలిచింది. మూడు మ్యాచుల్లో ఓడిపోగా మ‌రో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. 62.51 విజ‌య‌శాతంతో 90 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. ఇక ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ మూడో స్థానానికి ప‌డిపోయింది. కివీస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు మ్యాచులు ఆడింది. మూడు మ్యాచుల్లో గెల‌వ‌గా, మ‌రో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. 50 విజ‌య‌శాతం క‌లిగి ఉంది.

Also Read: ఇంగ్లాండ్‌పై చారిత్రాత్మ‌క టెస్టు సిరీస్ విజ‌యం.. దోహ‌ద‌ప‌డిన అంశాలు ఇవే..

ఇక టీమ్ఇండియా ప్ర‌స్తుతం అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఈ సైకిల్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచులు ఆడిన భార‌త్ ఆరు మ్యాచుల్లో గెల‌వ‌గా మ‌రో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భార‌త విజ‌య శాతం 68.51 కాగా.. 74 పాయింట్లు ఖాతాలో ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ (50), పాకిస్తాన్ (50) వ‌రుస‌గా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆరో స్థానంలో వెస్టిండీస్ (33.33), ఏడో స్థానంలో సౌతాఫ్రికా (25), ఎనిమిదిలో ఇంగ్లాండ్‌ (17.5) లు ఉన్నాయి. ఈ సైకిల్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి.. గెలుపు రుచి చూడ‌ని శ్రీలంక ఆఖ‌రి తొమ్మ‌దో స్థానంలో ఉంది.

ఆసీస్ కివీస్ రెండో టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 162 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 256 ప‌రుగులు చేసింది. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 372 ప‌రుగులు చేయ‌గా ఆసీస్ ముందు 279 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. అయితే.. ఛేద‌న‌లో 80 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయి ఆసీస్ క‌ష్టాల్లో ప‌డింది. మిచెల్ మార్ష్ (80), అలెక్స్ క్యాలీ (98నాటౌట్‌), పాట్ క‌మిన్స్ (32నాటౌట్‌) రాణించ‌డంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ విజ‌యం సాధించింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవ‌సం చేసుకుంది.

Also Read : మ‌రీ అంత ఎందుకురా అయ్యా.. వికెట్లు నిన్ను ఏమ‌న్నాయ్ చెప్పు.. ఫ‌లితం అనుభ‌వించావుగా