×
Ad

Venkatesh Iyer : ఇది క‌దా విధ్వంసం అంటే.. ఐపీఎల్ వేలం రోజే.. 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు.. జాక్ పాట్ నీదే గురూ..!

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer) స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద‌ర‌గొడుతున్నాడు.

SMAT 2025 Venkatesh Iyer score 70 runs from just 43 balls on IPL auction day

Venkatesh Iyer : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు వెంకటేష్ అయ్యర్ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అద‌ర‌గొడుతున్నాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత‌డు పంజాబ్‌తో మ్యాచ్‌లో చెల‌రేగిపోయాడు. ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగిన అత‌డు 43 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 ప‌రుగులు సాధించాడు.

అత‌డితో పాటు అనికేత్ వర్మ (31; 16 బంతుల్లో 3 సిక్స‌ర్లు), మంగేష్ యాదవ్ (28; 12 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన మ‌ధ్యప్ర‌దేశ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 225 ప‌రుగులు భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు తీశాడు. రమన్‌దీప్ సింగ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జస్సిందర్ సింగ్, రఘు శర్మ లు చెరో వికెట్ సాధించారు.

AUS vs ENG : మూడో టెస్టుకు ఆసీస్ తుది జ‌ట్టు ఇదే.. కెప్టెన్ వ‌చ్చేశాడు.. సీనియ‌ర్‌కు మొండిచేయి..

కేకేఆర్ వ‌దిలేసింది..
ఐపీఎల్ 2025 వేలంలో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు వెంక‌టేష్ అయ్య‌ర్‌ను (Venkatesh Iyer) రూ.23.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది. అయితే.. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో అయ్య‌ర్ దారుణంగా నిరాశ‌ప‌రిచాడు. 21 స‌గ‌టుతో 142 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో సీజ‌న్ చివ‌రిలో అత‌డికి తుది జ‌ట్టులోనూ స్థానం ద‌క్క‌లేదు. ఆ త‌రువాత అత‌డిని ఐపీఎల్ 2026 వేలానికి కేకేఆర్ విడుద‌ల చేసింది.

IPL 2026 Auction : విదేశీ ప్లేయ‌ర్ల ప‌ప్పులు ఇక ఉడ‌క‌వ్‌.. ఎంత‌కైనా అమ్ముడుపోనీ.. వాళ్ల‌కు ఇచ్చేది ఇంతే.. బీసీసీఐ నిబంధ‌న అదుర్స్‌.

కేకేఆర్ వేలానికి వ‌దిలివేసిన‌ప్ప‌టికి కూడా ఆ జ‌ట్టుతోనే ట‌చ్‌లోనే ఉన్న‌ట్లు ఓ సంద‌ర్భంలో అయ్య‌ర్ తెలిపాడు. మ‌రోవైపు కేకేఆర్ సైతం అత‌డిని త‌క్కువ మొత్తానికి ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. ఇక వేలం రోజు విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌డం, ఆల్‌రౌండ‌ర్ కావ‌డంతో అత‌డి కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డే అవ‌కాశం ఉంది.