Viral Video : కొడుకు ఇండియా కోసం క్రికెట్.. తండ్రి ఇంటింటికీ గ్యాస్ డెలివరీ

కొడుకు క్రికెట్ లో దూసుకుపోతున్నాడు. అతని తండ్రి మాత్రం ఇంటింటికి గ్యాస్ సిలెండర్లు డెలివరీ చేస్తున్నాడు. వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఎందుకంత కష్టం? అని అందనిరీ డౌట్ రావచ్చు. ఎందుకో? చదవండి.

Viral Video

Viral Video : క్రికెట్‌లో కొడుకు ఎంతో సక్సెస్ సాధించినప్పటికీ అతని తండ్రి తన పని మానుకోలేదు. ఎల్‌పిజి సిలెండర్లు మోస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొడుకు సంపాదిస్తుంటే కాలు మీద కాలేసుకుని హాయిగా కాలం గడపక అతనెందుకు ఇలా చేస్తున్నాడు? చదవండి.

Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతారు

ఇండియన్ క్రికెటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో దూసుకుపోతున్నారు. 2023 ఐపిఎల్ లో 14 మ్యాచ్ లలో 474 పరుగులు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 టీ 20 వరల్డ్ కప్‌లో సైతం చోటు దక్కించుకున్నారు. రింకూ సింగ్ ఎంతో సక్సెస్ ఫుల్‌గా తన కెరియర్లో దూసుకుపోతుంటే అతని తండ్రి  ఖంచంద్ సింగ్ మాత్రం అలీఘర్‌లో ఎల్‌పిజి సిలెండర్లు ఇంటింటికి డెలివరీ చేస్తూ జీవిస్తున్నారు. రీసెంట్‌గా ఆయన ఎల్‌పిజి డెలివరీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సందర్భంలోనే రింకూ గురించి చర్చ మొదలైంది.

Celebrity Cricket League 2024 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 10 .. కెప్టెన్లు.. ఓనర్లు ఎవరో తెలుసా? ఎప్పుడు మొదలంటే?

తను క్రికెట్‌లో సక్సెస్ అయి సంపాదిస్తున్నా తన తండ్రి తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టంగా లేరంటూ రింకూ మాట్లాడిన తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. తను చాలాసార్లు తండ్రికి ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకోమని సూచించానని అయిన తన పనిని ప్రేమిస్తున్న తండ్రి మాత్రం ఉద్యోగం మానట్లేదని వెల్లడించారు రింకూ సింగ్. ఇక ఖంచంద్ సింగ్ సిలెండర్లు మోస్తున్న వీడియో చూసి నెటిజన్లు ‘పనిని దైవంగా భావిస్తున్నారని., రియల్ లైఫ్ హీరో’  అని కామెంట్స్ పెడుతున్నారు.