భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ ప్రెసిడెంట్ (బిసిసిఐ) , సౌరవ్ గంగూలీ ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతుంది. సౌరవ్ గంగూలీ అన్నయ్య మరియు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ స్నేహసిష్ గంగూలీకి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో.. సౌరవ్ గంగూలీ హోమ్ క్వారంటైన్‌కు వెళ్లినట్లు చెబుతున్నారు.
స్నేహసిష్ గంగూలీ బెంగాల్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ ఆటగాడు. అతని కోవిడ్ -19 నివేదికలో పాజిటివ్ వచ్చిన తరువాత కోల్‌కతాలోని బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయమై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారి పిటిఐతో మాట్లాడుతూ, “అతను గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, రీసెంట్‌గా జరిగిన పరీక్షల్లో నివేదిక పాజిటివ్‌గా వచ్చిందని చెప్పారు. అతనిని బెల్లె వ్యూ ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ఆరోగ్య ప్రోటోకాల్ ప్రకారం, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణీత కాలానికి హోమ్ క్వారంటైన్‌కు వెళ్లవలసి వచ్చినట్లు చెప్పారు. స్నేహశిష్ గంగూలీకి కరోనా వైరస్ సోకినట్లు ఇంతకు ముందు నివేదికలు వచ్చాయి. కానీ స్నేహషిష్ తరువాత కరోనా బారిన పడలేదని స్పష్టం చేశాడు. అయితే, అతని భార్యకు కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే ఇంతవరకు సౌరవ్ గంగూలీ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
స్నేహసిష్ గంగూలీకి కరోనా వైరస్ సోకిన తరువాత, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు అవిశేక్ డాల్మియా కూడా హోమ్ క్వారంటైన్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. డాల్మియా.. వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ, “అవసరమైన ప్రోటోకాల్ ప్రకారం నేను రాబోయే కొద్ది రోజులు ఇంట్లో ఒంటరిగా ఉంటానని చెప్పారు.