WTC Final 2025
ప్రపంచ టెస్టు ఛాంపియన్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గదను సొంతం చేసుకుంటుంది. లేదంటే ఆసీస్ రెండో సారి డబ్ల్యూటీసీ విజేతగా నిలుస్తుంది.
ఎనిమిది వికెట్ల నష్టానికి 144 పరుగులతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 63 పరుగులను జోడించి మిగిలిన రెండు వికెట్లను కోల్పోయింది.
Yograj Singh : ఐపీఎల్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి టార్గెట్ పెట్టిన యోగరాజ్ సింగ్..
20 ఓవర్లకు పైగా..
మూడో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఓవర్ నైట్ బ్యాటర్ నాథన్ లయాన్ (2) ఓవర్‌నైట్ స్కోరు మరొక పరుగు జోడించి రబాడ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ టైమ్ పట్టదని అనిపించింది. అయితే.. జోష్ హేజిల్‌వుడ్ (17) అండతో మరో ఓవర్ నైట్ బ్యాటర్ మిచెల్ స్టార్క్ సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ నెమ్మదిగా స్కోరును ముందుకు కదించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్టార్క్, హేజిల్‌వుడ్ జోడీ 20 ఓవర్లకు పైగా సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ఎట్టకేలకు జోష్ హేజిల్‌వుడ్‌ను మార్‌క్రమ్ ఔట్ చేయడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 207 పరుగుల వద్ద ముగించింది. ఆఖరి వికెట్‌కు హేజిల్, స్టార్క్ జోడి 59 పరుగులు జోడించాడు. అటు స్టార్క్ మొత్తంగా 136 బంతులు ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు అజేయంగా నిలిచాడు.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 74 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.