Gautam Gambhir : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు బిగ్ షాక్..! స్వదేశానికి తిరిగి వచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో ఏడు రోజుల్లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

Gautam Gambhir
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరో ఏడు రోజుల్లో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే ఇంగ్లాండ్‌కు చేరుకున్న భారత జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో నేటి (జూన్ 13 శుక్రవారం) నుంచి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియా ఆటగాళ్లే రెండు జట్లుగా విడిపోయి ఈ మ్యాచ్ ఆడనున్నారు. టీమ్ఇండియా వ్యూహాలు ప్రత్యర్థి పసిగట్టకుండా ఉండేందుకు బయటవారిని మ్యాచ్‌కు అనుమతించడం లేదు. కాగా.. ఈ క్రమంలో భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది.
కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత దేశానికి తిరిగివచ్చినట్లుగా తెలుస్తోంది. గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న గంభీర్ భారత్‌కు వచ్చినట్లుగా సమాచారం.
Head Coach Gautam Gambhir is set to return to India due to a family emergency. [@RevSportzGlobal]
– He is likely to re-join the team early next week. 🇮🇳 pic.twitter.com/YzPIErt6ir
— Johns. (@CricCrazyJohns) June 13, 2025
టీమ్ఇండియాతో పాటు గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. బెకెన్‌హామ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో గంభీర్ మార్గనిర్దేశ్యంలో కొత్త కెప్టెన్ గిల్‌తో పాటు యువ ఆటగాళ్లు అందరూ సాధన చేశారు. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం, ఇప్పుడు గంభీర్ సైతం భారత్ కు రావడంతో టీమ్ఇండియాకు టెస్టు సిరీస్‌లు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఇక గంభీర్ తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఖచ్చితంగా ఏ తేదీన వెళతాడు అనేది మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు. అది ఆయన తల్లి ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.