Finn Allen : ఆ కొట్టుడు ఏంది సామీ.. ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందా ఏంటి? పొట్టి క్రికెట్‌లో క్రిస్‌గేల్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన కివీస్ ఆటగాడు..
టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ అరుదైన ఘనత సాధించాడు.

MLC 2025 Finn Allen breaks Chris Gayle world record in T20s
టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఆటగాడు ఫిన్ అలెన్ అరుదైన ఘనత సాధించాడు. పొట్టి క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) 2025 ఎడిషన్‌లో శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ ప్రాతినిథ్యం వహిస్తూ అలెన్ ఈ ఘనత సాధించాడు. వాషింగ్టన్ ఫ్రీడంతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 19 సిక్సర్లు బాదాడు.
గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్ పేరిట ఉండేది. 2017లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో గేల్ ఓ మ్యాచ్‌లో 18 సిక్సర్లు కొట్టాడు. ఫిల్ అలెన్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
టీ20 క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) – 19 సిక్సర్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) -18 సిక్సర్లు
సాహిల్ చౌహాన్ (సైప్రస్) -18 సిక్సర్లు
క్రిస్ గేల్ (వెస్టిండీస్) -18 సిక్సర్లు
ఈ మ్యాచ్‌లో 34 బంతుల్లోనే శతకం సాధించిన అలెన్.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్నాడు. 19 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 151 పరుగులు చేశాడు. ఎంఎల్‌సీ చరిత్రలో ఇదే వేగవంతమైన సెంచరీ.
🚨 FINN ALLEN SMASHED HUNDRED FROM JUST 34 BALLS IN MLC 🚨
– He has arrived in America 🤯🔥 pic.twitter.com/hVx4RaP6qL
— Johns. (@CricCrazyJohns) June 13, 2025
అలెన్ పెను విధ్వంసం ధాటికి శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అలెన్ కాకుండా సంజయ్ కృష్ణమూర్తి (36), హసన్ ఖాన్ (38 నాటౌట్ ) లు రాణించారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ రెండు వికెట్లు తీశాడు. నేత్రావల్కర్, మిచెల్ ఓవెన్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వాషింగ్టన్ 13.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. రచిన్ రవీంద్ర (17 బంతుల్లో 42 పరుగులు), మిచెల్ ఓవెన్ (20 బంతుల్లో 39 పరుగులు), జాక్ ఎడ్వర్డ్స్ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించినప్పటికి గ్లెన్ మాక్స్‌వెల్ (5), గ్లెన్ ఫిలిఫ్ (0)లతో పాటు మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో వాషింగ్టన్‌కు ఓటమి తప్పలేదు. శాన్‌ఫ్రాన్సిస్కో 123 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
కాగా.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కివీస్ స్టార్ ఆటగాడు ఫిన్ అలెన్‌ను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.