అయ్యో.. అలాచేస్తే ఔట్ కాదా..? డేవిడ్ బెడింగ్‌‌హామ్ ప్యాడ్‌లో బంతి ఇరుక్కుపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్..

క్రికెట్ నిబంధనల ప్రకారం.. బంతి బ్యాటర్ ప్యాడ్లలో లేదా దుస్తుల్లో ఇరుక్కుంటే అది డెడ్ అవుతుంది.

అయ్యో.. అలాచేస్తే ఔట్ కాదా..? డేవిడ్ బెడింగ్‌‌హామ్ ప్యాడ్‌లో బంతి ఇరుక్కుపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్.. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్..

David Bedingham

Updated On : June 13, 2025 / 8:12 AM IST

WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final)లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బౌలర్లు విజృంభిస్తుండటంతో బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపడుతున్నారు. అయితే, ఈ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. డేవిడ్ బెడింగ్‌హామ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి అతని ప్యాడ్ లో ఇరుక్కుపోయింది.. ఆ తరువాత జరిగిన ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

Also Raed: WTC Finalలో నిప్పులు చెరిగిన కమిన్స్.. రికార్డుల మీద రికార్డులు.. ఆ విషయంలో చరిత్ర సృష్టించిన SRH కెప్టెన్ ..!

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో రెండోరోజు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు 138 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే, లంచ్ బ్రేక్ కు ముందు బెడింగ్‌హామ్ 31 పరుగుల వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి గట్టెక్కాడు. పేసర్ వెబ్‌స్టర్ వేసిన షార్ట్ బంతి బెడింగ్ హామ్ బ్యాట్ అంచుకు తాకి అతడి ప్యాడ్ లోకి వెళ్లింది. కానీ, అది ప్యాడ్ లో పూర్తిగా ఇరుక్కోకుండా కిందకు జారే సమయంలో బెడింగ్ హామ్ దాన్ని చేతితో తీసి నేలమీదకు పడేశాడు. అప్పటికే క్యాచ్ అందుకోవడానికి వేగంగా వచ్చిన వికెట్ కీపర్ అలెక్స్ కేరీ హ్యాండిల్డ్ ద బాల్ ఔట్ కోసం అప్పీల్ చేశాడు. అయితే, అంపైర్ మాత్రం నాటౌట్ గా ప్రకటించాడు.

Also Raed: Gautam Gambhir : ‘ఇంత కంటే మంచి స‌మ‌యం మ‌రొక‌టి ఉండ‌దు..’ రోహిత్, కోహ్లీ, అశ్విన్ టెస్టు రిటైర్‌మెంట్ల‌పై గంభీర్ కామెంట్స్‌..

క్రికెట్ నిబంధనల ప్రకారం.. బంతి బ్యాటర్ ప్యాడ్లలో లేదా దుస్తుల్లో ఇరుక్కుంటే అది డెడ్ అవుతుంది. బ్యాటర్ పట్టుకున్నా నాటౌట్ గానే పరిగణిస్తారు. అయితే, తన ప్యాడ్ లో ఇరుక్కుని కిందకు పడే సమయంలో బెడింగ్‌హామ్ బంతిని పట్టుకోవడమే వివాదంకు దారితీసింది. బంతి డెడ్ అయినప్పుడు కాకుండా కదులుతూ ఉన్న సమయంలోనే అతడు పట్టుకున్నాడని, ఈ కారణంగా అతడు ఔట్ అంటూ కొందరు వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కొందరు బెడింగ్‌హామ్ ఔట్ అని వాదిస్తుండగా.. మరికొందరు అది నాటౌట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)