WTC Finalలో నిప్పులు చెరిగిన కమిన్స్.. రికార్డుల మీద రికార్డులు.. ఆ విషయంలో చరిత్ర సృష్టించిన SRH కెప్టెన్ ..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తుది పోరులో తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్ 28 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.

Pat Cummins
WTC Final: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిష్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రెండోరోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కమిన్స్ బంతులను ఎదుర్కోలేక సఫారీ బ్యాటర్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
Also Read: WTC Final 2025 : టెస్టుల్లో బుమ్రా రికార్డును బ్రేక్ చేసిన రబాడ.. ఆసీస్ పై ఒకే ఒక్కడు..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తుది పోరులో తొలి ఇన్నింగ్స్‌లో కమిన్స్ 28 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో రికార్డుల మోత మోగించాడు. కమిన్స్ విజృంభణతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయింది. అద్భుత ప్రదర్శనతో కమిన్స్ టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. రబాడను ఔట్ చేయడం ద్వారా అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. మరోవైపు ఐసీసీ ఫైనల్స్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ కమిన్స్ రికార్డుల్లోకెక్కాడు.
ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి సారథిగా కమిన్స్ (6/28) రికార్డు సృష్టించాడు. బెడింగ్‌హమ్‌ను ఔట్ చేసిన కమిన్స్.. అయిదో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ ఫీట్ దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ పేరిట ఉండేది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో కలిస్ 7.3 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఆ రికార్డును కమిన్స్ బ్రేక్ చేశాడు.
18.1-6-28-6 AT THE LORD’S.
– Captain Cummins at his best. pic.twitter.com/3yweqV3vyG
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 12, 2025
మరోవైపు.. జస్ర్పీత్ బుమ్రా(77)ని అధిగమించి డబ్ల్యూటీసీ 2023-2025లో అత్యధిక వికెట్లు (79) తీసిన బౌలర్ గానూ కమిన్స్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు.. లార్డ్స్ లో బెస్ట్ బౌలింగ్ చేసిన కెప్టెన్ గానూ కమిన్స్ నిలిచాడు. ఇంతకుముందు ఆ రికార్డు ఇంగ్లాండ్ కు చెందిన బాబ్ విల్లీస్ (6/101.. భారత్ పై, 1992) పేరిట ఉండేది. బిషన్ సింగ్ బేడీ (8)ని అధిగమించి టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించిన మూడో కెప్టెన్ గా కమిన్స్ (9) నిలిచాడు. రిచీ బెనాడ్ (9సార్లు, ఆస్ట్రేలియా), ఇమ్రాన్ ఖాన్ (12సార్లు, పాకిస్థాన్) అతని కంటే ముందున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 212
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 138
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 144/8