WTC Final 2025 : టెస్టుల్లో బుమ్రా రికార్డును బ్రేక్ చేసిన రబాడ.. ఆసీస్ పై ఒకే ఒక్కడు..
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు.

Kagiso Rabada Breaks Jasprit Bumrah World Record against Australia
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియా పై అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌తో 50 కి పైగా వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ద్వారా రబాడ ఈ ఘనత సాధించాడు.
ఈ క్రమంలో అతడు భారత పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బుమ్రా ఆసీస్ పై ప్రతి 39.9 బంతులకు ఓ వికెట్ పడగొట్టగా, రబాడ 38 బంతులకు ఓ వికెట్ తీశాడు. ఈ జాబితాలో వీరిద్దరి తరువాత లోహ్‌మన్, బిల్లీ బార్న్స్, డేల్ స్టెయిన్‌లు ఉన్నారు.
ఆస్ట్రేలియా పై అత్యుత్తమ స్ట్రైక్‌రేటుతో 50 ఫ్లస్ వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
కగిసో రబాడ – 54 వికెట్లు – 38 (స్ట్రైక్‌రేటుతో..)
జస్‌ప్రీత్ బుమ్రా – 64 వికెట్లు – 39.9
జీఏ లోహ్‌మన్ – 77 వికెట్లు – 42.9
బిల్లీ బార్న్స్ – 51 వికెట్లు – 44.8
డేల్ స్టెయిన్ – 70 వికెట్లు – 46.2
అత్యధిక వికెట్లు తీసిన నాలుగో సఫారీ ఆటగాడిగా..
టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు బౌలర్ల జాబితాలో రబాడా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతడు దిగ్గజ ఆటగాడు అలెన్ డొనాల్డ్‌ను అధిగమించాడు. డొనాల్డ్ 72 టెస్టుల్లో 330 వికెట్లు తీయగా, రబాడ 71 టెస్టుల్లో 333 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ జాబితాలో డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత షాన్ పొలాక్, ఎన్తినిలు ఉన్నారు.
టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
డేల్ స్టెయిన్ – 93 టెస్టుల్లో 439 వికెట్లు
షాన్ పొలాక్ – 108 టెస్టుల్లో 421 వికెట్లు
ఎన్తిని – 101 టెస్టుల్లో 390 వికెట్లు
కగిసో రబాడ – 71 టెస్టుల్లో 333 వికెట్లు
అలెన్ డొనాల్డ్ – 72 టెస్టుల్లో 330 వికెట్లు