Vaibhav Suryavanshi : ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు.. వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. 90 బంతుల్లో 190 ప‌రుగులు

ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మి(ఎన్‌సీఏ)లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.

Vaibhav Suryavanshi : ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు.. వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం.. 90 బంతుల్లో 190 ప‌రుగులు

Vaibhav Suryavanshi hits 190 off 90 balls before England series

Updated On : June 12, 2025 / 11:02 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో సెంచ‌రీతో అద‌ర‌గొట్టి అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు 14 ఏళ్ల యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌రుపున చాలా చ‌క్క‌టి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్ర‌మంలో అత‌డిని ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించే భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టులోకి తీసుకున్నారు.

జూన్ 24 నుంచి జూలై 23 మ‌ధ్య భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఐదు వ‌న్డే మ్యాచ్‌లు, ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడ‌నుంది. ఈ సిరీస్‌లో అండ‌ర్-19 కెప్టెన్ ఆయుష్ మాత్రే క‌లిసి వైభ‌వ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించ‌నున్నాడు.

Bhuvneshwar Kumar : వార్నీ.. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇన్నాళ్లు తెల‌వ‌క‌పాయె..

కాగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం భార‌త అండ‌ర్‌-19 జ‌ట్టు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మి(ఎన్‌సీఏ)లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్ర‌మంలో జ‌రిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. కేవ‌లం 90 బంతుల్లోనే 190 ప‌రుగులు సాధించాడు. అత‌డి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Jasprit Bumrah : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. అరుదైన రికార్డుపై జ‌స్‌ప్రీత్ బుమ్రా క‌న్ను..

అత‌డిని తొంద‌ర‌లోనే భార‌త సీనియ‌ర్ జ‌ట్టులో చూడాల‌ని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇంగ్లాండ్ టూర్ కు భారత అండ‌ర్‌-19 జట్టు ఇదే..

ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్ సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్ఎస్ ఆంబ్రిస్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ రాఘవ్, మోహన్ పటేల్, యుదజిత్ రాఘవ్, రాణా, అన్మోల్జిత్ సింగ్.

స్టాండ్‌బై ఆటగాళ్లు: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్ కీపర్).