Bhuvneshwar Kumar : వార్నీ.. భువనేశ్వర్ కుమార్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇన్నాళ్లు తెలవకపాయె..
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Bhuvneshwar Kumar Dance At Rinku Singh Priya Sarojs Engagement
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి భారత్‌కు ఎన్నో విజయాలను అందించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. తాజాగా భువీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ బాలీవుడ్ సాంగ్ కు భువీ డ్యాన్స్ చేశాడు.
టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం ఆదివారం (జూన్ 8న) ఘనంగా జరిగింది. ఈ వేడకకు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం హాజరు అయ్యారు. ఇక భువనేశ్వర్ కుమార్ సైతం ఈ వేడకుకు వచ్చారు.
రింకూ, ప్రియాకు అభినందలు తెలిపాడు. ఈ క్రమంలో బాలీవుడ్ పాట ప్లే అవుతుండగా ప్రియా డ్యాన్స్ చేస్తూ భువీని కూడా చేయాలని కోరింది. మనోడు మొదట కాస్త సిగ్గు పడినప్పటికి రింకూ సింగ్‌ను రమ్మని చెప్పాడు. మొత్తంగా ముగ్గురు (రింకూ, ప్రియా, భువీ)లు కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇన్నాళ్లు తెలియపాయె అని అంటున్నారు.
Rinku Singh & Priya Saroj Dance wih swing Master Bhuvneshwar Kumar @PriyaSarojMP #rinkusingh #ringceremony pic.twitter.com/qsVQ3Esq59
— gaurav singh (@gauravsingh078) June 9, 2025
ఐపీఎల్ 2025 సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడాడు. ఆర్‌సీబీ తొలి టైటిల్‌ను గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత స్పెల్ ( 2/38) ను వేశాడు.