Sourav Ganguly : ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ఎంపిక పై గంగూలీ సంచలన వ్యాఖ్యలు.. తప్పు చేశారు..
గత సంవత్సరం కాలంగా భీకర ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడాన్ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు.

Sourav Ganguly advocates for Shreyas Iyer inclusion in the Test squad against England
గత సంవత్సరం కాలంగా భీకర ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడాన్ని టీమ్ఇండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. ఈ క్రమంలో సెలక్టర్లపై మండిపడ్డాడు. తానే గనుక సెలక్టర్‌ను అయితే.. శ్రేయస్ అయ్యర్‌ను తప్పకుండా ఎంపిక చేసేవాడినని అన్నాడు.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో ఇంగ్లాండ్ పర్యటనలో మిడిల్ ఆర్డర్‌లో అయ్యర్ ప్రధాన ఆటగాడిగా ఉంటాడని చాలా మంది భావించారు. అయితే.. ఇంగ్లాండ్ టూర్‌కు అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఇప్పటికే శ్రేయస్‌ను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. తాజాగా ఈ జాబితాలో గంగూలీ చేరిపోయాడు.
WTC : డబ్ల్యూటీసీ విజేతకు గదను ఎందుకు ఇస్తారో తెలుసా? గద వెనుక ఉన్న స్టోరీ ఇదే..
‘గత ఏడాదిగా శ్రేయస్ అయ్యర్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. అతడి ప్రస్తుత ఫామ్‌ని పరిగణలోకి తీసుకుంటే ఇంగ్లాండ్ టూర్‌కు అతడు ఎంపిక కావాల్సి ఉంది. ఒత్తిడిలోనూ అతడు చక్కగా ఆడుతున్నాడు. గతంతో పోలిస్తే షార్ట్ బాల్స్‌ను సమర్థవంతంగాఎదుర్కొంటున్నాడు. టెస్టు ఫార్మాట్ భిన్నమైనప్పటకి, అతడు ఈ ఫార్మాట్‌లో ఎలా రాణిస్తాడో చూడాలని ఉంది.’ అని గంగూలీ అన్నాడు.
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్‌లో భారత జట్టు విజయావకాశాలపైనా గంగూలీ మాట్లాడాడు. భారత్ తప్పకుండా విజయాన్ని సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో కోహ్లీ, రోహిత్ లేకుండానే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సిరీస్‌ను సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. జూన్ 20న హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – జూన్ 20 నుంచి 24 వరకు – లీడ్స్
* రెండో టెస్టు – జూలై 2 నుంచి 6 వరకు – బర్మింగ్హమ్
* మూడో టెస్టు – జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్
* నాలుగో టెస్టు – జూలై 23 నుంచి 27 వరకు – మాంచెస్టర్
* ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు -కెన్నింగ్‌స్టన్ ఓవల్