WTC final 2025 : డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే పరిస్థితి ఏంటి? ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలలో టెస్టు ఛాంపియన్ షిప్ గదను సొంతం చేసుకునేది ఎవరంటే?
లార్డ్స్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది

What happen if wtc final 2025 match between Australia and South Africa is a draw
లార్డ్స్ మైదానం వేదికగా బుధవారం నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా జట్లు ఫైనల్ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి. జూన్ 11 నుంచి 15 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. జూన్ 16న రిజర్వ్ డేగా ఐసీసీ నిర్ణయిచింది. ఏదైన కారణం చేత టెస్టు మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో ఆట కోల్పోతే.. రిజర్వ్ డే రోజున మ్యాచ్‌ను నిర్వహిస్తారు. లేదంటే ఐదు రోజుల్లోనే మ్యాచ్ ముగుస్తుంది.
పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అటు టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ఐసీసీ టైటిల్‌ను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు లార్డ్స్‌కు చేరుకున్నాయి. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.
Jasprit Bumrah : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డుపై జస్‌ప్రీత్ బుమ్రా కన్ను..
డ్రా అయితే పరిస్థితి ఏంటి?
2019లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు రెండు ఎడిషన్లు పూర్తి అయ్యాయి. ఇది మూడో ఎడిషన్. తొలి రెండు ఎడిషన్లలో అద్భుతంగా రాణించి ఫైనల్స్‌కు చేరుకున్న భారత్.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. తొలిసారి న్యూజిలాండ్, రెండో సారి ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది.
ఈ క్రమంలో అభిమానుల అందరి దృష్టి మూడో ఎడిషన్‌లోని ఫైనల్ మ్యాచ్ పై పడింది. ఈ మ్యాచ్ డ్రా అయితే పరిస్థితి ఏంటి అన్న విషయంలో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే ఇరు జట్లు టెస్టు ఛాంపియన్ షిప్ గదను షేర్ చేసుకుంటాయి.
WTC Final : బుధవారమే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ విజేత ప్రైజ్‌మనీని ఐసీసీ ఈ సారి భారీగా పెంచింది. విజేతకు రూ.30.8 కోట్లు దక్కనున్నాయి. అదే విధంగా రన్నరప్‌కు రూ.17.9 కోట్లు లభించనున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు రూ.12.34 కోట్లు అందనున్నాయి.
డబ్ల్యూటీసీ 2025 ప్రైజ్‌మనీ వివరాలు..
* విజేతకు – రూ 30.8 కోట్లు
* రన్నరప్‌కు – రూ 17.9 కోట్లు
* భారత్‌కు – రూ 12.34 కోట్లు
* న్యూజిలాండ్ – రూ 10.26 కోట్లు
* ఇంగ్లాండ్‌కు – రూ 8.21 కోట్లు
* శ్రీలంక – రూ 7.18 కోట్లు
* బంగ్లాదేశ్ – రూ 6.16 కోట్లు
* వెస్టిండీస్ – రూ 5.21 కోట్లు
* పాకిస్థాన్ – రూ 4.1 కోట్లు