WTC Final : బుధ‌వారమే డ‌బ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్ మ్యాచ్‌.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదిక‌గా బుధ‌వారం నుంచి డ‌బ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

WTC Final : బుధ‌వారమే డ‌బ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్ మ్యాచ్‌.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

Do you know where to watch WTC final 2025 match

Updated On : June 10, 2025 / 4:18 PM IST

క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న మ్యాచ్‌ల్లో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ 2023-25) ఫైన‌ల్ మ్యాచ్ ఒక‌టి. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదిక‌గా బుధ‌వారం (జూన్ 11) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌ద కోసం ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు పోటీప‌డుతున్నాయి. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు కూడా లార్డ్స్‌కు చేరుకుని ముమ్మ‌రంగా ప్రాక్టీస్‌ను చేస్తున్నాయి.

ఈ ఫైన‌ల్ మ్యాచ్ జూన్ 11 నుంచి 15 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. జూన్ 16 రిజర్వ్ డే కింద‌ కేటాయించారు. వ‌ర్షం లేదా ఇత‌ర కార‌ణాల వ‌ల్ల ఆట‌ను న‌ష్ట‌పోతే.. రిజ‌ర్వ్ డే నాడు నిర్వ‌హించవ‌చ్చు.

MS Dhoni : ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ధోని.. మిస్ట‌ర్ కూల్ స్పంద‌న ఇదే..

వ‌రుస‌గా రెండో సారి విజేత‌గా నిల‌వాల‌ని ఆస్ట్రేలియా ఆరాట‌ప‌డుతోండ‌గా, తొలిసారి ఐసీసీ టైటిల్‌ను ముద్దాడాల‌ని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు కోరుకుంటోంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి వ‌ర్షం ముప్పు లేదు. ఐదు రోజుల పాటు ఆట స‌జావుగానే సాగే అవ‌కాశాలు ఉన్నాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంటే.. పేస‌ర్లు, వేడిగా ఉంటే స్పిన్న‌ర్లు కీల‌కం అవుతారు.

ఈ మ్యాచ్‌ను ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

డ‌బ్ల్యూటీసీ 2023-25 ఫైన‌ల్ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మ‌న‌దేశంలో ఈ మ్యాచ్ ప్ర‌సార హ‌క్కుల‌ను స్టార్ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లు సొంతం చేసుకున్నాయి. టీవీల్లో అయితే స్టార్ స్పోర్ట్స్ ఛాన‌ల్స్‌లో మొబైల్‌లో అయితే జియోహాట్ స్టార్‌లో మ్యాచ్‌ను చూడొచ్చు.