Jasprit Bumrah : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. అరుదైన రికార్డుపై జస్‌ప్రీత్ బుమ్రా కన్ను..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

Massive WTC record Jasprit Bumrah just two 5 wicket hauls away
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంతకముందు వరకు ఈ సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా పిలవగా తాజాగా టెండూల్కర్, అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదికగా జరగనుంది. కాగా.. ఈ సిరీస్ ముంగిట టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను అరుదైన ఘనత ఊరిస్తోంది.
ఈ సిరీస్‌లో బుమ్రా మరో రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే.. డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ డబ్ల్యూటీసీలో 11 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇక బుమ్రా 10 సార్లు ఈ ఘనత సాధించాడు.
WTC Final : బుధవారమే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
కాగా.. ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లే ఆడనున్నట్లు ఇప్పటికే అజిత్ అగార్కర్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. ఏ మూడు మ్యాచ్‌లు ఆడతాడు అనే విషయం ఇంకా తెలియరాలేదు.
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టెస్టు – జూన్ 20 నుంచి 24 వరకు – హెడింగ్లీ
* రెండో టెస్టు – జూలై 2 నుంచి 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్
* మూడో టెస్టు – జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్
* నాలుగో టెస్టు – జూలై 23 నుంచి 27 వరకు – ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్
* ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – కియా ఓవల్.