WTC Final 2025 : మ్యాచ్ గమనాన్నే మార్చేసిన దక్షిణాఫ్రికా ఒక్క తప్పు.. సఫారీలకు డబ్ల్యూటీసీ టైటిల్ అందని ద్రాక్షేనా?
లండన్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.

లండన్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. తొలి రోజు ఆటలో పేసర్లు విజృంభించారు. పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని ఇరు జట్ల బౌలర్లు సద్వినియోగం చేసుకోవడంతో మొదటి రోజే 14 వికెట్లు నేలకూలాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది ఆస్ట్రేలియా. దక్షిణాఫ్రికా పేసర్లు కగిసో రబాడ(5/51), మార్కో యాన్సెన్(3/49) నిప్పులు చెరగడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో బ్యూ వెబ్‌స్టర్ (72; 92 బంతుల్లో 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్(66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు.
WTC Final 2025 : టెస్టుల్లో బుమ్రా రికార్డును బ్రేక్ చేసిన రబాడ.. ఆసీస్ పై ఒకే ఒక్కడు..
ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ఆరంబించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 43/4 స్కోరుతో నిలిచింది. కెప్టెన్ బవుమా (3), బెడింగ్‌హామ్ (8)లు క్రీజులో ఉన్నారు. రెండో రోజు సఫారి బ్యాటర్లు ఎంతమేరకు పోరాడతారు అన్న దానిపై మ్యాచ్ గమనం ఆధారపడి ఉంటుంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమిన్స్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
ఘోర తప్పిదం..
కాగా.. తొలి రోజు ఆటలో దక్షిణాఫ్రికా చేసిన ఓ తప్పిదం ఆసీస్‌కు వరంలా మారింది. ఈ తప్పిదం కారణంగా సఫారీలు మ్యాచ్‌లో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. అతడు 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔట్ కావాల్సి ఉంది. కానీ దక్షిణాఫ్రికా ఆటగాళ్ల నిర్లక్ష్యం కారణంగా బతికిపోయాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ 29వ ఓవర్‌ను రబాడ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని వెబ్‌స్టర్ షాట్ ఆడగా.. బంతి బ్యాట్‌ను మిస్సై ప్యాడ్‌ను తాకింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ అంటూ అప్పీలు చేయగా, అంపైర్ పెద్దగా స్పందించలేదు. ఇక అంతకముందే దక్షిణాఫ్రికా రెండు రివ్యూలు తీసుకోగా.. అంపైర్స్ కాల్స్ అని వచ్చాయి. దీంతో వెబ్‌స్టర్ విషయంలో రివ్యూ తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు.
Australia 🤝 umpire’s call on DRS
Steve Smith & Beau Webster have both been saved by the on-field call with reviews that were thiiiiiiis close.
And just after Webster avoided an early #WTCFinal exit, South Africa failed to review one that was plumb >> https://t.co/mn0zmJpk1H pic.twitter.com/L864DVQJAJ
— Fox Cricket (@FoxCricket) June 11, 2025
అయితే.. రిప్లేలో అది క్లియర్‌గా ఎల్బీడబ్ల్యూగా తెలిసింది. సఫారీ ఆటగాళ్లు రివ్యూ తీసుకుని ఉంటే వెబ్‌స్టర్ 8 పరుగుల వద్దే ఔట్ అయ్యేవాడు. అప్పుడు ఆసీస్ 150 లోపే ఆలౌట్ అయ్యే అవకాశాలు ఉండేవి. ఇక ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వెబ్‌స్టర్ తనదైన శైలిలో ధాటిగా ఆడుతూ స్టీవ్ స్మిత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించి ఆసీస్‌కు మంచి స్కోరు అందించాడు.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్ల్యూటీసీ టైటిల్‌ను తొలిసారి ముద్దాడాలని భావించిన సఫారీలకు తాము చేసిన ఈ తప్పిదం కారణంగా ఆ ఆశ నెరవేరకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు.