South Africa vs India: భారత్‌పై సౌతాఫ్రికా ఘన విజయం.. ఏ మాత్రం రాణించలేకపోయిన భారత బ్యాటర్లు

South Africa vs India: భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (76 పరుగులు), శుభ్‌మన్ గిల్ (26) మినహా ఎవరూ రాణించలేకపోయారు.

Virat Kohli

సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచులో ఇండియా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (76 పరుగులు), శుభ్‌మన్ గిల్ (26) మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగులతో విజయం సాధించింది.

ఈ మ్యాచులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 67.4 ఓవర్ల వద్ద 245 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 108.4 ఓవర్ల వద్ద 408 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు 34.1 ఓవర్ల వద్ద 131 పరుగులకే కుప్పకూలారు.

రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్లలో నాంద్రే బర్గర్ 4, మార్కో జాన్సెన్ 3, రబాడా 2 వికెట్లు తీశారు. టీమిండియా బ్యాటింగ్‌లోనే కాక బౌలింగ్‌లోనూ రాణించలేకపోయింది. సౌతాఫ్రికా టూర్ లో భాగంగా షెడ్యూల్లో మొత్తం రెండు టెస్టులు ఉన్నాయి. సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు జనవరి 7న జరగనుంది.

ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో కెమెరాకు చిక్కిన లవర్స్