ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో కెమెరాకు చిక్కిన లవర్స్
స్టేడియంలో ఎవరు లేని చోట ఏకాంతంగా ముచ్చటలాడుకుంటున్న ఓ ప్రేమజంటను కెమెరా జూమ్ చేసి చూపించేసరికి స్టేడియమంతా కేరింతలతో మార్మోగింది.

Australia vs Pakistan 2nd Test Hasan Ali Dance 3rd umpire stuck in lift
AUS vs PAK : ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. థర్డ్ అంపైర్ లిఫ్ట్‌లో ఇరుక్కపోవడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ తన డాన్స్‌తో స్టేడియంలోని ప్రేక్షకులు ఆకట్టుకున్నాడు. ఇక ప్రపంచాన్ని మరిచిపోయి తమ లోకంలో విహరిస్తున్న ఇద్దరు యువతీయువకులు కెమెరాకు దొరికిపోవడంతో స్టేడియం ఒక్కసారిగా కేరింతలతో హోరెత్తింది.
లిఫ్ట్‌లో ఇరుక్కపోయిన థర్డ్ అంపైర్
మూడు రోజు లంచ్ విరామం తర్వాత మ్యాచ్ ప్రారంభించడానికి అందరూ రెడీ అయ్యారు. అయితే థర్డ్ అంపైర్ ఇల్లింగ్‌వర్త్ మాత్రం అక్కడ కనబడలేదు. విషయం ఏంటాని ఆరా తీయగా.. ఆయన లిఫ్టులో ఇరుక్కపోయినట్టు తెలిసింది. ఈ విషయం కామెంటేటర్లు ప్రకటించడంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు.. నవ్వులు చిందించారు. ఆయన వచ్చిన తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా ఆట ప్రారంభమైంది.
హసన్ అలీ డాన్స్ అదుర్స్
పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ తన డాన్స్ స్టేడియంలో తన డాన్స్ స్కిల్స్ చూపించాడు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తూ ప్రేక్షకులతో డాన్స్ చేయించాడు. అతడితో పాటు డాన్స్ చేసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపించడంతో స్టేడియంలో సందడి వాతావరణ నెలకొంది. కామెంటేటర్లు కూడా దీని గురించి ప్రస్తావించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Get your body moving with Hasan Ali! #AUSvPAK pic.twitter.com/8Y0ltpInXx
— cricket.com.au (@cricketcomau) December 28, 2023
కెమెరాకు చిక్కిన లవర్స్
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్ లో మరో ఆసక్తికర ఘటనను కెమెరా కన్ను పట్టేసింది. మైదానంలో ఎవరు లేని చోట ముచ్చటలాడుకుంటున్న ఓ ప్రేమజంటను కెమెరా జూమ్ చేసి చూపించేసరికి స్టేడియమంతా కేరింతలతో మార్మోగింది. క్రికెటర్లు కూడా ఆసక్తిగా అటువైపు చూస్తుండిపోయారు. ప్రేమికుడు సిగ్గుతో ముఖం దాచుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ వీడియో చూసినవారంతా నవ్వు ఆపులేకపోతున్నారు.
— Pushkar (@musafir_hu_yar) December 28, 2023