IPL Ad Revenue : ఐపీఎల్‌లో 10 సెకన్ల యాడ్‌కు టీవీలు ఎంత వసూల్ చేస్తాయంటే?

కరోనా లాక్‌డౌన్లతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఆ ప్రభావం అడ్వెర్‌టైజ్‌ సెక్టార్‌పై పడింది.2021 ఏడాదిలో క్రీడల పుణ్యామని టెలివిజన్ ఆదాయం పుంజుకుంది.

Sports to bring more ad revenues to TV : కరోనా లాక్‌డౌన్లతో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించింది. వ్యాపారాలు తగ్గిపోయాయి. ఆ ప్రభావం అడ్వెర్‌టైజ్‌ సెక్టార్‌పై పడింది. ఫలితంగా యాడ్‌ రెవెన్యూతోనే నడిచే టెలివిజన్‌ రంగానికి భారీ దెబ్బ పడింది. ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా విజయం సాధించడం, ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో యాడ్‌ రెవెన్యూ పెరిగింది. కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చినా టోక్యో ఒలింపిక్స్‌ మళ్లీ టీవీ రంగాన్ని ఆదుకున్నాయి. కరోనా కష్ట కాలంలో ఐపీఎల్ టెలివిజన్ రంగాన్ని ఆదుకుంది. 2021 ఏడాదిలో క్రీడల పుణ్యామని టెలివిజన్ ఆదాయం పుంజుకుంది. ప్రత్యేకించి యాడ్ రెవిన్యూలో అధిక ఆదాయాన్ని ఆర్జించాయి.

మొన్నటివరకూ టీవీ యాడ్‌ రెవెన్యూలో పది శాతం మాత్రమే స్పోర్ట్స్‌ వాటా ఉండేది.. కానీ, ఇప్పుడు యాడ్ రెవిన్యూ 20 శాతానికి చేరుకుంది. క్రికెట్‌లో టీమిండియా విక్టరీలతో విజృంభిస్తుంటే.. టీవీల యాడ్‌ రెవిన్యూ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. ఒక్క ఐపీఎల్ (Indian Premier League) మాత్రమే కాదు.. T20 World Cup, Tokyo Olympics, ఇతర క్రీడలు కూడా టీవీ రంగానికి ఊపిరిపోశాయనే చెప్పాలి. క్రీడలపై 15 శాతం యాడ్ రెవిన్యూ ఉండగా.. మొత్తంగా టీవీ అడ్వర్టైజ్ ఎకోసిస్టమ్ లో 18శాతం నుంచి 20 శాతానికి యాడ్ రెవిన్యూ పెరిగిపోయిందని DDB Mudra Group అడ్వర్టైజింగ్ కంపెనీ హెడ్ రామ్మోహన్ సుందరం తెలిపారు.
IPL 2021 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగే

కరోనా మహమ్మారికి ముందు మొత్తంగా కనీసం రూ.28వేల కోట్లు ఉండగా.. అందులో టీవీ యాడ్ రెవిన్యూ రూ.2, 500 కోట్లు ఒక స్పోర్ట్స్ నుంచే ఉంది. ఐపీఎల్‌ తర్వాత ఏకంగా రూ. 4500 కోట్ల నుంచి రూ. 5వేల కోట్ల వరకు చేరుకుందని ఆయన తెలిపారు. టీవీలకు భారీ ఆదాయం అందిస్తున్న క్రీడల్లో క్రికెట్‌ అగ్రస్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్‌ ద్వారా రూ.300ల నుంచి రూ. 400 కోట్ల ఆదాయం లభించింది.

పొట్టి క్రికెట్‌కు ఫుల్ క్రేజ్.. రూ.1,200 కోట్ల రెవెన్యూ అంచనా :
అతి త్వరలో జరగబోయే T20 వరల్డ్‌ కప్‌ ద్వారా రూ.1,200 కోట్ల రెవెన్యూ వస్తుందని యాడ్‌ ఏజెన్సీలు అంచనా. ఐపీఎల్‌ 14 సీజన్‌ యాడ్‌ రెవిన్యూ విలువ ఏకంగా రూ. 2,500 కోట్లకు చేరింది. మిగతా క్రీడలకంటే ఈ పొట్టి క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. ఐపీఎల్ 14 సీజన్ మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడా ఐపీఎల్ 14కు సంబంధించి 10 సెకన్ల యాడ్ ఇచ్చినందుకు టీవీలు రూ.14 లక్షల వరకు వసూల్ చేశాయట. ఒక సెకనుకు లక్షకు పైగానే.. ఎంత చెల్లించడానికైనా కార్పొరేట్ కంపెనీలు వెనుకాడటం లేదు.

టీవీలు ఎంత అడిగితే అంత యాడ్ కు చెల్లించేందుకు ముందుకు వస్తున్నాయి. యాడ్ ఏజెన్సీ రీడిఫ్యూజన్ MD డాక్టర్ సందీప్ గోయల్ ప్రకారం.. T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు IPL మ్యాచ్‌ల మాదిరిగానే యాడ్ రెవిన్యూను ఆకర్షిస్తాయి. T20 ప్రపంచ కప్ మ్యాచ్‌కు రూ.50 కోట్లు వరకు తీసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ మొత్తం తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన ఐపిఎల్ 14 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు జరుగనున్నాయి. T20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 14 వరకు మొత్తం 45 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
Actress Alankrita Sahai : పట్టపగలు నటిని బంధించి రూ.6.5 లక్షలు చోరీ

ట్రెండింగ్ వార్తలు