Ishan Kishan : ఔట్ అయ్యావ్.. వెళ్లిపో.. ఇషాన్ కిషన్‌పై బౌలర్ దురుసు ప్రవర్తన.. ఇషాన్ రియాక్షన్ వీడియో వైరల్..
Ishan Kishan : ఇషాన్ కిషన్ వైపు వేలు చూపిస్తూ నువ్వు అవుట్ అయ్యావ్.. వెళ్లిపో.. అంటూ ఎస్ఆర్‌హెచ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ దురుసుగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Harishth Thanniru
- Published On : March 22, 2026 / 01:26 PM IST
Ishan Kishan
Ishan Kishan : ఐపీఎల్ – 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు సిద్ధమవుతోంది. గత సీజన్‌లో లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్‌హెచ్ జట్టు ఈసారి టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ సీజన్లో ఎస్ఆర్‌హెచ్ జట్టుకు కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమయ్యాడు. వెన్ను గాయంతో తొలి దశలో కొన్ని మ్యాచ్‌లకు కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం బాధ్యతలు అప్పగించింది.
Also Read : RCB Sale : ఆర్సీబీ అమ్మకం ప్రక్రియలో బిగ్ ట్విస్ట్.. రేసులోకి మరో ప్రముఖ సంస్థ.. బిగ్ ఫైట్..
అయితే, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఎస్ఆర్‌హెచ్ జట్టు సభ్యులు రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ పట్ల స్పిన్నర్ జీషన్ అన్సారీ దురుసుగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా రెండో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్ జీషన్ అన్సారీ బౌలింగ్ చేశాడు. అప్పటికే బౌండరీలు బాదుతూ ఇషాన్ కిషన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీ పూర్తిచేసి సెంచరీవైపు దూసుకెళ్తున్నాడు. అన్సారీ బౌలింగ్‌లో ఇషాన్ తొలి నాలుగు బంతులను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి అన్సారీ ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. ఇషాన్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సమయంలో ఇషాన్ పట్ల అన్సారీ దూకుడుగా ప్రవర్తించాడు.
ఇషాన్ కిషన్‌వైపు వేలు చూపిస్తూ నువ్వు అవుట్ అయ్యావ్.. వెళ్లిపో.. అంటూ సైగ చేశాడు. అన్సారీ ప్రవర్తనతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఇషాన్ కిషన్ మాత్రం లైట్‌గా తీసుకున్నాడు. జీషన్ అన్సారీ ప్రవర్తన అనంతరం నవ్వుతూ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో జట్టు సభ్యుల మధ్య ఏమైనా విబేధాలు ఉన్నాయా..? లేదంటే అన్సారీ సరదాగా ఇలా చేశాడా.. అని అభిమానుల నుంచి కామెంట్లు వస్తున్నాయి.
Send off to Ishan Kishan 🤯
During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.
The team atmosphere doesn’t seem to be very good.
— Stubbsy (@spideypant_) March 21, 2026
